AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఎంత విషాదం.. గణేష్ నిమజ్జనం వేళ వెంటాడిన మృత్యువు.. డ్యాన్స్‌ చేస్తుండగానే..

కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపులో ఆనందంగా డ్యాన్సులు వేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుతో నేలకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకు అందరితో సరదాగా నవ్వుతూ చిందులు వేసిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.

అయ్యో ఎంత విషాదం.. గణేష్ నిమజ్జనం వేళ వెంటాడిన మృత్యువు.. డ్యాన్స్‌ చేస్తుండగానే..
Karnataka Incident
Anand T
|

Updated on: Sep 01, 2025 | 1:08 PM

Share

ఓ వైపు దేశం మొత్తం వియానక చవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా తాజాగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని రెండు వెర్వేరు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. మండ్య జిల్లా కె.ఆర్.పేట తాలూకాలోని జోట్టనపుర గ్రామానికి చెందిన మంజునాథ్‌ అనే భక్తులు వినాయక నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించినా ఎలాంటి లాభం లేకపోయింది.

డ్యాన్స్‌ చేస్తుండగా గుండెపోటు..

ఇదిలా ఉండగా చిక్కబళ్లాపూర్ జిల్లాలోనే ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. శిడ్లఘట్ట తాలూకా బోడగురు గ్రామంలో చెందిన లక్ష్మిపతి అనే వ్యక్తి గణేష్ నిమజ్జన వేడుకలో నాగవల్లి పాటకు నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.

గణేష్ ఊరేగింపులో ట్రాక్టర్ నుంచి పడి వ్యక్తి మృతి

ఈ రెండు ప్రాంతాల్లో గుండెపోటు కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే.. మైసూర్ జిల్లాలోని హున్సూర్ తాలూకాలో గణేష్‌ నిమజ్జనాల సందర్భంగా ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మరణించాడు. గ్రామంలో గణేష్ నిమజ్జనం కోసం ట్రాక్టర్‌లో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఇంతలో, రాజు తన ఇంటి దగ్గరకు వచ్చిన గణేశుడిని దర్శించుకునేందుకు ట్రాక్టర్‌పైకి ఎక్కాడు. వినాయకుడికి మొక్కే క్రమంలో అకస్మాత్తుగా ట్రాక్టర్‌పై నుంచి కింద పడిపోయాడు. దీంతో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ మార్గమధ్యలో అతను తుది శ్వాస విడిచాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!