నిమజ్జన వేడుకల్లో అపశృతి.. ఆరుగురు చిన్నారులు మృతి

| Edited By:

Sep 10, 2019 | 11:54 PM

కర్నాటక గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కోలార్ జిల్లా క్యేశంబల్లా సమీపంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే వినాయకడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఆరుగురు చిన్నారులు చెరువులో పడి చనిపోయారు. మరదగట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులంతా పన్నెండేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. మృతులను రక్షిత, తేజస్విని, వీణ, వైష్ణవి, రోహిత్, ధనుష్‌గా గుర్తించారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఏడుగురు చిన్నారులు గ్రామంలో ఉన్న చెరువు […]

నిమజ్జన వేడుకల్లో అపశృతి.. ఆరుగురు చిన్నారులు మృతి
Follow us on

కర్నాటక గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కోలార్ జిల్లా క్యేశంబల్లా సమీపంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే వినాయకడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఆరుగురు చిన్నారులు చెరువులో పడి చనిపోయారు. మరదగట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులంతా పన్నెండేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. మృతులను రక్షిత, తేజస్విని, వీణ, వైష్ణవి, రోహిత్, ధనుష్‌గా గుర్తించారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఏడుగురు చిన్నారులు గ్రామంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు. అయితే వినాయకుడిని చెరువులో వేసే క్రమంలో ముగ్గురు చిన్నారులు ఆ చెరువులో పడ్డారు. అయితే వారిని కాపాడేందుకు మరో ముగ్గురు అందులోకి దూకారు. అయితే వారు కూడా అందులో మునిగిపోతుండటం చూసి.. అక్కడే ఉన్న మరో బాలుడు గట్టిగా అరుస్తుండటం గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో మునిగిపోయిన చిన్నారులను స్థానికులు బయటకు తీసి.. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటి కే వారు ప్రాణాలు విడిచారని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో మరదగట్టి గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకేసారి ఆరుగురు పిల్లలు చనిపోవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.