శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని అరెస్టు చేశారు. కశ్మీర్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే తరిగమితో పాటు ఇతర కార్యకర్తలను ఆయన కలుసుకునేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ఏచూరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దుతో శ్రీనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అనేక ఆంక్షలు ఉన్నాయి. ఏచూరితో పాటు డీ రాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ పార్టీ నాయకులను కలుసుకోవాలని.. మమల్ని అడ్డుకోరాదంటూ ఇద్దరు నేతలు కశ్మీర్ గవర్నర్‌కు లేఖ రాశారు. కానీ పోలీసులు మాత్రం సీపీఎం నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను కూడా గురువారం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో అడ్డుకుని తిరిగి పంపించేశారు.
.@SitaramYechury has being detained at Srinagar Airport and not allowed to move anywhere. This despite the fact that he had informed the administration about his visit to meet CPIM MLA MY Tarigami who is not well & other party workers.
We strongly protest this illegal detention.— CPI (M) (@cpimspeak) August 9, 2019