Silver Rate in Hyderabad… పైపైకి వెండి ధర.. భారీగా పెరుగుదల… కిలో వెండి ధర ఎంతో తెలుసా..?

ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా.. స్టాక్ మార్కెట్లు పతనమైనా.. వెండి ధర మాత్రం నిలకడగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బంగారంతో పాటు వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.

Silver Rate in Hyderabad... పైపైకి వెండి ధర.. భారీగా పెరుగుదల... కిలో వెండి ధర ఎంతో తెలుసా..?

Edited By:

Updated on: Dec 17, 2020 | 8:40 AM

భారతీయ సంస్కృతిలో బంగారం, వెండి ఆభరణాలకు ప్రాముఖ్యత ఎక్కువ. ఆడా, మగ తేడాలేకుండా అందరు బంగారం, వెండితో చేసిన ఆభరణాలను ధరిస్తారు. అయితే బంగారం ధర కొనలేని వారు కనీసం వెండినైనా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు వెండి సైతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది. ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా.. స్టాక్ మార్కెట్లు పతనమైనా.. వెండి ధర మాత్రం నిలకడగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బంగారంతో పాటు వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.

ఏకంగా ఆరు వేల ఐదు వందల పెరుగుదల….

డిసెంబర్ 7న కిలో వెండి ధర 63 వేలు ఉండగా… డిసెంబర్ 8న వెండి ధర ఏకంగా ఆరు వేల ఐదు వందల రూపాయలు పెరిగి 69,500లకు చేరింది. అయితే డిసెంబర్ 11,12 తేదీల్లో వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా 66,800లుగా కొనసాగింది. డిసెంబర్ 14న మాత్రం వెండి ధరలో మార్పు వచ్చింది. కిలో వెండిపై దాదాపు 4,200 ధర తగ్గింది. ఇప్పుడ మళ్లీ రెండు రోజులుగా వెండి ధర పెరుగుతోంది. రోజుకు వేయి రూపాయల చొప్పున పెరిగింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.68900గా ఉంది. కాగా రానున్న రోజుల్లో సైతం వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.