
గాంధర్వ ఆతిథ్యం బృందం 'భారత వాద్య దర్శనం' పేరుతో గొప్ప ప్రదర్శన ఇచ్చింది. భారతీయ సంగీత వారసత్వ సంపద గొప్పతనాన్ని చాటి చెప్పేలా జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతంతో పాటు సమకాలీన సంగీతంలో ఉపయోగించే పరికరాలతో సంగీత విభావరి నేతలను ఆకట్టుకుంది.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన విందులో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షెహనాయ్, మోహన్ వీణతో పాటు దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన వాద్య పరికారలతో ఉద్భవించిన సంగీతం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ వాయిద్య పరికరాల్లో 34 హిందుస్తానీ, 18 కర్ణాటక సంగీతం, 26 జానపద సంబంధ పరికరాలను ఉపయోగించారు. మొత్తం 78 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు దివ్యాంగులు కూడా ఉన్నారు.

హిందుస్థానీ మ్యూజిక్ విభాగంలో రాగ్ దర్బారీ కండా, కాఫి-ఖెలత్ హోరి, ఫోక్ మ్యూజిక్: రాజస్థాన్-కేసరియా బలమ్, ఘుమర్, నింబురా నింబురా ఇలా రకరకాల విభాగాల్లో నిర్వహించిన సంగీత కచేరి దేశాధినేతలను విశేషంగా ఆకట్టుకుంది.

మ్యూజికల్ జర్నీ ఆఫ్ భారత్ అనే థీమ్‌తో సాగిన ఈ సంగీత ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు తమ మత ప్రాంతానికి చెందిన సంప్రదాయక వేషదారణలో పాల్గొని ప్రత్యేకంగా నిలిచారు.