మరణించాడనుకుని అంత్యక్రియలు పూర్తి.. మూడు నెలల తర్వాత తిరిగొచ్చిన చనిపోయిన వ్యక్తి.. ట్విస్ట్ ఇదే.!

|

Mar 30, 2021 | 4:38 PM

Shocking Incident: అతడు చనిపోయాడని అనుకున్నారు.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అలా మూడు నెలలు గడిచిపోయాయి. అప్పుడే ఎవరూ ఊహించని..

మరణించాడనుకుని అంత్యక్రియలు పూర్తి.. మూడు నెలల తర్వాత తిరిగొచ్చిన చనిపోయిన వ్యక్తి.. ట్విస్ట్ ఇదే.!
Dead Man Alive
Follow us on

Shocking Incident: అతడు చనిపోయాడని అనుకున్నారు.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అలా మూడు నెలలు గడిచిపోయాయి. అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ వ్యక్తి నిక్షేపంగా ఇంటికి తిరిగొచ్చాడు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కుదస్సనాడులో నివసించే సాబూ అనే వ్యక్తి తిరువనంతపురంలో క్యాటరింగ్, బస్ క్లీనింగ్ వంటి ఉద్యోగాలు చేస్తూ బ్రతుకు బండిని నడిపిస్తుండేవాడు. ఇతగాడికి చిన్న చిన్న చోరీలు చేయడం కూడా అలవాటు. ఒకసారి తను పని చేసే హోటల్‌లోనే దొంగతనం చేసి దొరికిపోయాడు. ఆ కేసులో పోలీసులు సాబూను గతేడాది నవంబర్‌లో అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అతడి గురించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు.

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇక తిరువనంతపురం పోలీసులు ఆ మృతదేహం సాబూదేనని అనుమానం వ్యక్తం చేసి.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కూడా పొరపాటు పడి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది.

శుక్రవారం ఓ బస్ డ్రైవర్‌కు సాబూ తారసపడ్డాడు. ఆ డ్రైవర్ సాబూను గుర్తుపట్టి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీనితో కథ సుఖాంతం అయింది. అయితే పోలీసులు మాత్రం గతేడాది డిసెంబర్‌లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు.

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!