ప్రియుడితో రెడ్‌హ్యండెడ్‌గా దొరికిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్..

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య మరోవ్యక్తితో ఏంకాతంగా ఉండడం చూసిన భర్త.. భార్యతో పాటు ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేసి వారి తలలను మెండాల నుంచి వెరు చేసి.. వాటిని సంచిలో వేసుకొని నేరుగా సెంట్రల్‌ జైలుకు వెళ్లి లోంగిపోయాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

ప్రియుడితో రెడ్‌హ్యండెడ్‌గా దొరికిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్..
Shocking Double Murder

Updated on: Sep 11, 2025 | 9:51 PM

భార్య మరోవ్యక్తితో ఏంకాతంగా ఉండడం చూసిన భర్త.. భార్యతో పాటు ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో వెలుగు చూసింది. నిందితుడు అంతటితో ఆగకుండా ఇద్దరి తలలను శరీరాల నుండి వేరు చేసి వాటిని ఒక సంచిలో వేసుకొని నేరుగా సెంట్రల్‌ జైలుకు వెళ్లి లోంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కల్లకురిచ్చి జిల్లాలోని మలైకొట్టలం గ్రామానికి చెందిన రైతు కోలంజి (52) తన రెండవ భార్య లక్ష్మికి (39) స్థానికంగా నివాసం ఉంటున్న తంగరసు (60) తో అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి, వారిద్దరు తన ఇంటి టెర్రస్‌పై ఏకాంతంగా ఉండటాన్ని చూసిన కొలంజి. కోపంతో కొడవలి తీసుకొని వాళ్ల ఇద్దరిని నరికి హత్య చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత వారి శరీరాల నుంచి తలలను వేరు చేసి ఒక సంచిలో వేసుకున్నాడు.

తర్వాత రోజు ఉదయం, ఆ రెండు తలలను ఒక సంచిలో వేసుకొని బస్సులో తిరువన్నమలై మీదుగా వెల్లూరుకు చేరుకున్నాడు కొలంజి. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తోరప్పాడిలోని సెంట్రల్ జైలుకు చేరుకున్న అతను తన భార్యను, ఆమె ప్రియుడిని చంపినట్లు జైలు గార్డులకు చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన గార్డ్స్‌ అతని బ్యాగును తనిఖీ చేశారు. ఆ బ్యాగ్‌లో రెండు రక్తపు మరకలు ఉన్న తలలు కనిపించడం చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థానికి చేరకున్న సీనియర్ అధికారులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని, కొలాంజీని అదుపులోకి తీసుకున్నారు. తరువాత, కళ్లకురిచ్చి పోలీసులకు అతన్ని అప్పగించారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఘటనా స్థలానిక చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.