Big Alert: షిర్డీ వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై ఆలయంలోకి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు అలర్ట్‌ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ క్రమంలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే భక్తులు పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకురావడంపై నిషేధం విధించింది. అయితే ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Big Alert: షిర్డీ వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై ఆలయంలోకి ఆ వస్తువులకు నో ఎంట్రీ!
Shirdi Saibaba

Updated on: May 11, 2025 | 8:10 AM

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే భక్తులు పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకురావడంపై నిషేధం విధించింది. అయితే షిర్డీలోని ఈ బాబా ఆలయానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల భద్రతా దృష్ట్యానే ఈ ఆంక్షలు పెట్టినట్టు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. ఇకపై ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే ఆలయంలోకి పంపిచనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో గతవారంలో ఆలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. వీటి పట్ల అప్రమత్తమైన సిబ్బంది ఆలయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తుల భద్రతను దృష్ట్యా.. ఆలయంలోకి దండలు, పుష్పాలు, శాలువాలు తీసుకురావడంపై ఆంక్షలు విధిస్తూ ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆంక్షలపై సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు గడిల్కర్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపనున్నట్టు తెలిపారు. ఈ నెల 2వ తేదీన ఆలయ ట్రస్ట్‌కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు ముంబయిలోని సిద్ధివినాయక ఆలయంలో కూడా ఇలాంటి ఆంక్షలే అమల్లోకి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. మే 11 తేది నుంచి సిద్ధివినాయక ఆలయంలోకి దండలు, ప్రసాదం, కొబ్బరికాయలను తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us