ఇండియాలో కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ కి ‘సీరం’ బ్రేక్ !

ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ ని సీరం ఇన్స్ టిట్యూట్ నిలిపివేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తదుపరి ఆదేశాలు అందేంతవరకు ట్రయల్స్ ను ఆపి వేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది.

ఇండియాలో కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ కి సీరం బ్రేక్ !

Edited By:

Updated on: Sep 10, 2020 | 2:55 PM

ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ ని సీరం ఇన్స్ టిట్యూట్ నిలిపివేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తదుపరి ఆదేశాలు అందేంతవరకు ట్రయల్స్ ను ఆపి వేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. బ్రిటన్ లో ఈ వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ కి అస్వస్థత తలెత్తడంతో అక్కడ దీని ట్రయల్ కి బ్రేక్ పడింది. ఆ రోగికి వివరణాత్మక రిపోర్టు ఎందుకు పంపలేదంటూ డీసీజీఐ.. సీరం కంపెనీకి ఇదివరకే షో కాజ్ నోటీసును పంపింది. ఆక్స్ ఫర్డ్ పరిశోధకులతో కలిసి వ్యాక్సీన్ ని  డెవలప్ చేసిన ఆస్ట్రాజెనికా.. తమ సేఫ్టీ డేటాను ఓ ఇండిపెండెంట్ కమిటీ రివ్యూ చేసేందుకు అనువుగా ప్రస్తుత దశ ట్రయల్స్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సీరం, ఆస్ట్రాజెనికా దాదాపు ఒకే విధమైన వ్యాక్సీన్ తయారు చేస్తున్నాయి. అటు-ఇండియాలో తమ ట్రయల్స్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టం చేశారు.