హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ పై పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కూడా మరో కేసు పెట్టారు. కేరళ లోని ఓ వెబ్ సైట్ కి కంట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న కప్పన్ కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి కూడా. కప్పన్ ని వెంటనే విడుదల చేయాలని కేరళ జర్నలిస్టులు కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారు.