Farmers Protest: రాజధానిలో భారీగా పోలీసుల మోహరింపు.. ఘాజీపూర్ మండీ, పలు రహదారుల మూసివేత

|

Jan 27, 2021 | 11:49 AM

కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన..

Farmers Protest: రాజధానిలో భారీగా పోలీసుల మోహరింపు.. ఘాజీపూర్ మండీ, పలు రహదారుల మూసివేత
Follow us on

Farmers Protest Updates – Delhi: కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో ఓ రైతు మరణించగా.. వందలాది మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో, నగరంలో పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ మండీని మూసివేశారు. అంతేకాకుండా ఎన్‌హెచ్‌ 9,24 రహదారులను సైతం మూసివేస్తున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు మెట్రోస్టేషన్లను సైతం మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శారు. సింఘు, ఘాజీపూర్‌ తదిత బోర్డర్లల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించారు. ప్రయాణికులు ఢిల్లీ నుంచి ఘజియాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే షహదర, కర్కారీ మార్గ్, డీఎన్‌డీ నుంచి తిరిగి వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు.

ట్రాక్టర్‌ ర్యాలీలో భాగంగా మంగళవారం రైతులు ఢిల్లీ నలువైపుల నుంచి నగరంలోకి దూసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులు రైతులపై లాఠిచార్జ్‌ చేయడంతోపాటు, బాష్ఫవాయు గోళాలను సైతం ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు భారీకేడ్లను దాటుకుంటూ ఎర్రకోటకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు 22 కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.