ఆకుపచ్చ రంగులో సముద్రం అలలు.. భయాందోళనలో మత్స్యకార గ్రామాలు.. ఏం జరగనుంది..?!

|

Nov 17, 2022 | 8:51 PM

ఈ కారణంగా సముద్రం నుంచి కాంతి బయటకు ప్రసరించినప్పుడు ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. సముద్రం నీలంగా ఉండటానికి ప్రధాన కారణం.. ఆకాశం నుంచి

ఆకుపచ్చ రంగులో సముద్రం అలలు.. భయాందోళనలో మత్స్యకార గ్రామాలు.. ఏం జరగనుంది..?!
Kanyakumari
Follow us on

గత కొన్ని రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద నీరు సముద్రంలోకి చేరుతోన్న క్రమంలో కన్యాకుమారి వద్ద సముద్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. కన్యాకుమారిలో ఆకుపచ్చ రంగులో సముద్రం అలలు సందడి చేస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. దీంతో అధికారులకు సమాచారమిచ్చారు మత్యకారులు. దీంతో రంగు మారడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.. సముద్రం అలలు ఆకుపచ్చ రంగులోకి మారడం పట్ల మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

సముద్ర తీర ప్రాంతానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో బురద నీరుతో నీలి సముద్రం కాస్త ఆకుపచ్చ రంగులోకి మారింది..వరద నీరు ఎక్కువగా రావడం తో నీళ్ళు ఆకుపచ్చ రంగులో కనువిందు చేశాయి. బురద నీరుతో ఆకుపచ్చ కెరటాలు ఉప్పొంగుతున్నాయి. ఆకుపచ్చ రంగుతో సముద్రంలో అద్భుత దృశ్యం కనిపిస్తోంది.

మహాసముద్రాల్లో నీరు స్వచ్ఛమైనది కావు.. సముద్ర జీవుల నుంచి లవణాలు, కణజాలం, చిన్న శకలాలు వంటి అనేక మలినాలతో నిండిఉంటుంది. ఈ కారణంగా సముద్రం నుంచి కాంతి బయటకు ప్రసరించినప్పుడు ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. సముద్రం నీలంగా ఉండటానికి ప్రధాన కారణం.. ఆకాశం నుంచి కొంత కాంతిని ప్రతిబింబిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి