రైలులోని ఏసీ-3 కోచ్‌లో బొద్దింకలు పడుతున్నాయని ఫిర్యాదు చేయడం మనం తరచుగా వింటుంటాం. కానీ, విమానంలో తేలు ఉందని తెలిస్తే ఆ ప్రయాణీకులు పడే టెన్షన్ మామూలుగా ఉండదు మరీ. సరిగ్గా ఇలాంటి సీనే ఎదురైంది ఎయిరిండియా విమానంలో. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దాంతో వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమైంది. అయితే, విమానాల్లో పాములు, పురుగులు, ఎలుకలు, పక్షులు కూడా కనిపించాయి. కానీ, ఒక ప్రయాణికుడిని తేలు కుట్టడం బహుశా ఇదే మొదటిసారి. నాగ్‌పూర్-ముంబై విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక మహిళను తేలు కుట్టింది. విమానం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే, మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఎయిరిండియాకు చెందిన నాగ్‌పూర్-ముంబై ఫ్లైట్ (AI 630) ముంబయి విమానాశ్రయానికి చేరుకోవటానికి ముందుగానే సిబ్బంది ఎయిర్‌ఫోర్ట్‌లో డాక్టర్‌తో సిద్ధంగా ఉన్నారు. మహిళ ప్రయాణికురాలికి తేలు కుట్టిన విషయం మెసేజ్ చేశారు. మహిళ విమానం నుండి కిందకు దిగిన వెంటనే వైద్య బృందం ఆమెకు చికిత్స ప్రారంభించింది. ఆస్పత్రికి తీసుకెళ్లి కొంతసేపటి తర్వాత డిశ్చార్జి చేశారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్స్ చెప్పటంతో బాధితురాలితో పాటు ఇటు ఎయిర్‌పోర్ట్ సిబ్బంద సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన 23 ఏప్రిల్ 2023లో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..