మీ వెహికిల్ కూడా పొగలు కక్కుతోందా..? మీరు రహదారిపై నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా..? మిమ్మల్ని ఎవరూ చూడటం లేదని అనుకుంటున్నారా..? అయితే, మీరు పొరపాటుపడినట్టే. . మీ వాహనం కూడా కాలుష్యాన్ని విస్తరిస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండండి. వైరల్ వీడియో ఆధారంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు
మే8 సోమవారం రోజున ఉదయం ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 25వ లో ఒక స్కూటీ పొగలు కక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. హర్యానా నంబర్ ప్లేట్ ఉన్న ఈ స్కూటీకి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైరల్ వీడియో ఆధారంగా ఆ బైక్‌కు రూ.17000 చలాన్ విధించారు.
సోమవారం నాడు వైరల్ అయిన వీడియోలో స్కూటీ సైలెన్సర్ నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి. నంబర్ ప్లేట్ లేకపోవడం, బీమా లేకుండా వాహనాలు నడపడం, వాయుకాలుష్యం అనే విభాగంలో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..