
వేసవి సెలవుల తర్వాత దేశమంతటా పాఠశాలలు జూన్ 2న తిరిగి ప్రారంభమయ్యాయి. జూన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు జూలై నెల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ నెలలో ఏమైనా సెలవులు వస్తున్నాయా? అని ఎదురు చూస్తున్నారు. పాఠశాలలు ప్రారంభంలో తీవ్రమైన వేడి కారణంగా జూన్ రెండవ వారం వరకు పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఉష్ణోగ్రతలు తగ్గడంతో జూన్ 2న ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పాఠశాల విద్యా శాఖ ధృవీకరించింది. ఆ తేదీన విద్యార్థులు తరగతులకు తిరిగి వచ్చారు.
చాలా మంది విద్యార్థులు ఇప్పుడు తమ తదుపరి సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఆసక్తిగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం బక్రీద్ పండుగ శనివారం నాడు వచ్చింది. సాధారణంగా శనివారం పాఠశాలలకు ఆఫ్‌డే ఉంటుంది. దీంతో విద్యార్థులకు కొంత మేలే. కానీ అదనపు సెలవు దినం లేదు. జూలై నెలను దృష్టిలో ఉంచుకుంటే క్యాలెండర్‌లో ఒకే ఒక్క ప్రభుత్వ సెలవుదినం ఉంది. అది మొహర్రం పండగ. అది ఆదివారం జూలై 6న వస్తుంది. అయితే ఈ పండగ ఆదివారం వస్తుండటంతో ప్రత్యేకంగా సెలవు ఉండదు.
జూన్, జూలై నెలల్లో సాధారణ శని, ఆదివారాలు తప్ప మరే అదనపు సెలవులు లేకపోవడం విద్యార్థులను మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులను, ప్రభుత్వ సిబ్బందిని కూడా కొంత నిరుత్సాహపరిచింది. అయితే, మొహర్రం పండుగను సూచించే నెలవంక ఒక రోజు తరువాత కనిపించినట్లయితే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. సెలవు సోమవారం జూలై 7కి మారవచ్చు. అలాంటప్పుడు ఆది, సోమవారాల్లో సెలవు ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు శనివారం కూడా ఒక రోజు సెలవు పెట్టినట్లయితే వారుసగా మూడు రోజుల పాటు హాలిడేస్ ఉండే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి