పద్మనాభస్వామి ఆలయ బాధ్యతలు రాచకుటుంబానికే.. సుప్రీంకోర్టు

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 11:30 AM

కేరళలో పద్మనాభ స్వామి ఆలయ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాచకుటుంబానివేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆలయ పర్యవేక్షణను ఇక తిరువనంతపురం జిల్లా జడ్జి ఆధ్వర్యాన గల కమిటీ చూసుకుంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన కమిటీ..

పద్మనాభస్వామి ఆలయ బాధ్యతలు రాచకుటుంబానికే.. సుప్రీంకోర్టు
Follow us on

కేరళలో పద్మనాభ స్వామి ఆలయ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాచకుటుంబానివేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆలయ పర్యవేక్షణను ఇక తిరువనంతపురం జిల్లా జడ్జి ఆధ్వర్యాన గల కమిటీ చూసుకుంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన కమిటీ ఏర్పడేంతవరకు ఈ పద్ధతి అమలులో ఉంటుందని, కమిటీలో ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీ కీలక పాత్ర వహిస్తుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పద్మనాభ స్వామి ఆలయ అంతర్భాగంలోని నాలుగు సెల్లార్లలో వేల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ముత్యాలు, అమూల్య రత్నాలు ఉన్నట్టు 2011 లో నిర్వహించిన ఓ తనిఖీలో వెల్లడైంది.  అయితే ఆ తరువాత.. కొన్ని వందల కేజీల బంగారు ఆభరణాలు మాయమైనట్టు వార్తలు వచ్చాయి.