శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ ధర్మాసనం త్వరలో రోజువారీ విచారణ చేపడుతోంది. ఈ పిటిషన్లను పరిశీలించేసమయంలో మతపరమైన పద్దతుల విషయంలో న్యాయ సమీక్ష పరిధి ఏమిటి.. అలాగే రాజ్యాంగంలోని 25 (2) ( బీ) కింద హిందువుల విభాగం అంటే.. మత స్వేచ్ఛ దాని పరిధి.. తదితర అంశాలను కూలంకషంగా అధ్యయనం చేయనుంది. శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది కేవలం విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, మతానికి కూడా సంబంధించినదని కోర్టు లోగడే స్పష్టం చేసింది. అన్ని మతాలవారు తమ మందిరాల్లో మహిళల ప్రవేశంపై విధించిన ఆంక్షలను కూడా కోర్టు ఈ సందర్భంగా పరిశీలించనుంది.