సుప్రీంలో ఆర్నాబ్‌కు రిలీఫ్.. కానీ..

| Edited By:

Apr 24, 2020 | 3:30 PM

రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్‌ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై.. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన సుప్రీం మెట్లెక్కారు. తనకు అరెస్ట్‌ నుంచి రక్షణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆర్నాబ్ గోస్వామికి మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ మూడు వారాల్లోపు ముందస్తు […]

సుప్రీంలో ఆర్నాబ్‌కు రిలీఫ్.. కానీ..
Follow us on

రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్‌ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై.. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన సుప్రీం మెట్లెక్కారు. తనకు అరెస్ట్‌ నుంచి రక్షణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆర్నాబ్ గోస్వామికి మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ మూడు వారాల్లోపు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఆర్నాబ్‌ గోస్వామి పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ చేపట్టింది. ఆర్నాబ్‌ తరఫున సీనియర్ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

కాగా.. ఆర్నాబ్‌పై దాఖలైన అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. నాగ్‌పూర్‌లో నమోదైన కేసుపై మాత్రం స్టే విధించలేదు. అయితే ప్రస్తుతం ఈ కేసును కూడా ముంబైకి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే.. రిపబ్లిక్‌ టీవీకి సెక్యూరిటీ కల్పించాలంటూ ముంబై పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.