Sasikala Released From Jail: అన్నాడీఎంకే బహిష్కృత నేత.. తమిళనాడు మాజీ సీఎం దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జయలలిత మరణానంతరం అవినీతి కేసులో చిన్నమ్మ నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన శశికళ ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.బెంగళూరు పరప్పన జైలు నుంచి శశికళ రిలీజ్ కానున్నారు. ఈ మేరకు అధికారులు ఆమెకు అధికారిక పాత్రలను అందజేశారు.
అయితే కరోనా నిబంధనల ప్రకారం మరో 10 రోజుల పాటు ఆమెకి చికిత్స అవసరమని.. ఆస్పత్రిలో ఉండాలని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Also Read: బీ టౌన్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న తాప్సీ.. ఎడారిలో వర్కవుట్ చేస్తుంది ఎందుకో..