కర్నాటక డ్రగ్స్ కేసు, వివేక్ ఒబెరాయ్ బావ ఇంట్లో పోలీసుల సోదాలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 15, 2020 | 1:21 PM

కర్ణాటకలో దివంగత మంత్రి జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య ఆల్వా ఇంటిపై రాష్ట్ర పోలీసులు మంగళవారం దాడి చేశారు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేస్తున్న ఖాకీలు వరుసగా ఇటు పొలిటికల్..

కర్నాటక డ్రగ్స్ కేసు, వివేక్ ఒబెరాయ్ బావ ఇంట్లో పోలీసుల సోదాలు
Follow us on

కర్ణాటకలో దివంగత మంత్రి జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య ఆల్వా ఇంటిపై రాష్ట్ర పోలీసులు మంగళవారం దాడి చేశారు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేస్తున్న ఖాకీలు వరుసగా ఇటు పొలిటికల్, అటు సినీ రంగ ప్రముఖులపై ‘ఉక్కుపాదం’ మోపుతున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కి స్వయానా బావ అయిన ఆదిత్య ఆల్వా ఇంటిని సెర్చ్ వారంట్ తో సోదాలు చేశామని జాయింట్ కమిషనర్ (క్రైమ్) తెలిపారు. శాండల్ వుడ్ డ్రగ్ స్కాండల్ లో పోలీసులు నిందితులుగా పేర్కొన్న 12 మందిలో ఆదిత్య ఆల్వా కూడా ఒకరు. ఈ కేసులో సినీ నటి రాగిణి ద్వివేదీని 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపగా .సంజనా గల్రానీని, మరికొందరిని రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. త్వరలో మరి కొందరి పేర్లు కూడా బయటపడనున్నాయని తెలుస్తోంది.