Cauvery Calling: సద్గురు కావేరి కాలింగ్ ఉద్యమం.. ఇప్పటివరకు 13.4 కోట్ల చెట్లు నాటారు..

శాస్త్రీయ పునరుత్పాదక వ్యవసాయం, వ్యవసాయ ఆర్థిక శాస్త్రంపై దృష్టి సారించిన సేవ్ సాయిల్ ఉద్యమం సమాంతర చొరవ అయిన సేవ్ సాయిల్ రీజనరేటివ్ రెవల్యూషన్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రగతి కూడా అంతే గణనీయంగా ఉంది. మార్చి 31, 2026 నాటికి ఈ ఉద్యమం 532 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. 40,311 మంది రైతులు పునరుత్పాదక వ్యవసాయాన్ని అవలంబించేలా చేరింది.

Cauvery Calling: సద్గురు కావేరి కాలింగ్ ఉద్యమం.. ఇప్పటివరకు 13.4 కోట్ల చెట్లు నాటారు..
Cauvery

Updated on: May 30, 2026 | 3:14 PM

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు మొదలుపెట్టిన ‘సేవ్ సాయిల్ – కావేరి కాలింగ్’ ఉద్యమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ ఉద్యమం ద్వారా 13.4 కోట్ల చెట్లు నాటారు. అంతేకాకుండా 2.6 లక్షల మంది రైతులు వృక్ష ఆధారిత వ్యవసాయాన్ని పాటించడానికి ఇది మద్దతుగా నిలిచింది. ఇదే పంథాను కొనసాగిస్తూ 2026-27 ఆర్దిక సంవత్సరంలో 1.2 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘సేవ్ సాయిల్ – కావేరి కాలింగ్’ అనేది రైతుల నేతృత్వంలోని ఒక పర్యావరణ ఉద్యమం. కావేరి నదిని పునరుజ్జీవింపజేయడం, వృక్ష ఆధారిత వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ఈ ఉద్యమ లక్ష్యం. అడవుల ద్వారా పోషించబడే కావేరి నది గత కొన్నేళ్లుగా క్షీణిస్తోంది. గత 70 ఏళ్లలో వృక్ష సంపదలో 87 శాతం కోల్పోయింది. దీనిని పరిష్కరించడానికి ప్రైవేట్ వ్యవసాయ భూముల్లో 242 కోట్ల చెట్లను నాటడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. వ్యవసాయ భూముల్లో చెట్లను పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరడంతో పాటు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల నీటి నిలుపుదల సామర్థ్యం పెరగడం వల్ల నదిపై ఆధారపడి జీవిస్తున్న 8.4 కోట్ల మంది ప్రజలకు ఏడాది పొడవునా నీటి సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

‘సేవ్ సాయిల్ – కావేరి కాలింగ్’ ఉద్యమంపై ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ ఇతిరాజాలు మాట్లాడుతూ.. “13 కోట్ల చెట్లు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. 2.6 లక్షల మంది రైతులకు ప్రతిరూపం. ఏకపంట విధానం నుండి వృక్ష ఆధారిత వ్యవసాయానికి మారేందు జరిగిన మార్పు.. రాబోయే దశాబ్దాలలో కావేరి ఏడాది పొడవునా ప్రవహిస్తుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. రైతులు ఒకే తాటిపైకి వచ్చినప్పుడు భారత్ ఒకే ఒక సాహసోపేతమైన చర్యతో తన మట్టిని పునరుజ్జీవింపజేయగలదని మేము తమ్ముతున్నాం.. ఇది నీటి వనరులను నింపడంతో పాటు గ్రామీణ జీవనోపాధిని సురక్షితం చేయగలదు. ‘సేవ్ సాయిల్’ (మట్టిని రక్షిద్దాం) పేరుతో జరుగుతున్న ఉద్యమం కింద క్షేత్రస్థాయిలో సాగుతున్న మూడు ప్రధాన కార్యక్రమాలలో కావేరి కాలింగ్ ఒకటి. సేవ్ సాయిల్ రీజనరేటివ్ రెవల్యూషన్ కింద రైతులకు శాస్త్రీయ పునరుత్పాదక వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టడం రెండో కార్యక్రమం. సేవ్ సాయిల్ ఫార్మర్స్ మూవ్‌మెంట్ కింద మార్కెట్ సదుపాయాలు, ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి రైతులను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా సంఘటితం చేయడం మూడో కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు కలిసి శిక్షణ, సాంకేతిక మద్దతు, సమాజ ఆధారిత చర్యల ద్వారా నేల ఆరోగ్యం, రైతుల జీవనోపాధి. గ్రామీణ స్థితిస్థాపకతను పరిష్కరిస్తాయి” అని ఆనంద్ పేర్కొన్నారు.

కావేరి కాలింగ్ 2025లో 14,000 మందికి పైగా రైతుల భాగస్వామ్యంతో 3 భారీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. వృక్ష ఆధారిత వ్యవసాయంపై ఆచరణాత్మక జ్ఞానాన్ని పంచుకోవడానికి IISR, IIHR, KFRI, ICFRE, TNAU, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వంటి సంస్థల నుండి నిపుణులను రప్పించింది.

Follow Us