Sadhguru With Barun Das: ‘డ్యుయోలాగ్ విత్ బరుణ్ దాస్’.. ఆదియోగి విగ్రహం గురించి సద్గురు ఆసక్తికర విషయాలు..

|

Feb 19, 2023 | 10:49 AM

ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ నేటి తరం యువతను సైతం ఆకట్టుకుంటన్నారు సద్గురు. ఇక తాజాగా శివరాత్రిని...

Sadhguru With Barun Das: ‘డ్యుయోలాగ్ విత్ బరుణ్ దాస్’.. ఆదియోగి విగ్రహం గురించి సద్గురు ఆసక్తికర విషయాలు..
Sadhguru Jaggi Vasudev
Follow us on

ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ నేటి తరం యువతను సైతం ఆకట్టుకుంటన్నారు సద్గురు. ఇక తాజాగా శివరాత్రిని పురస్కరించుకొని ఈశా యోగా సెంటర్‌లో భారీ మహాశివరాత్రి వేడుకలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల కంటే ముందే సద్దురు TV9 నెట్‌వర్క్ ఎండీ అండ్‌ సీఈఓ బరున్‌దాస్ డ్యుయోలాగ్‌ (Duologue with Barun Das)కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను పంచుకున్నారు. బరున్‌ దాని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను మొత్తం ఆరు ఎపిసోడ్స్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఈషా యోగా సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ ఆదియోగి విగ్రహానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సద్గురు పంచుకున్నారు. ఈ విగ్రహ నిర్మాణంలో ఉల్లాసము, నిశ్చలత్వం, మైమరపు అనే మూడు కోణాలుగా అభివర్ణించారు. రోజువారీ జీవితంలో ఉత్సాహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి సద్గురు మాట్లాడుతూ.. ఉత్సాహంతో నిండిన జీవితం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే దృక్పథాన్ని ఇస్తుందన్నారు. అయితే నిశ్చలత లేని ఉత్సాహం అస్థిరతకు దారి తీస్తుందని సద్గురు తెలిపారు. 112 అడుగులు ఎత్తైన ఆదియోగి విగ్రహం శివుడిని మొదటి యోగిగా సూచిస్తుందని చెప్పుకొచ్చారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఉత్సాహాన్ని కలిగి ఉండాలి, అదే లేకపోతే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని సద్గురు ప్రశ్నించారు.

నిశ్చలత గురించి సద్గురు మాట్లాడుతూ.. నిశ్చలత లేకపోతే, ఉల్లాసానికి భంగం కలుగుతుంది. ఇది కొంత కాలానికి అస్థిరతగా మారుతుందన్నారు. ఉల్లాసానికి నిశ్చలత సపోర్ట్‌గా లేకపోతే పరిస్థితులు అస్థిరంగా మారుతాయని సద్గురు అన్నారు. ఇక మత్తు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది మత్తును ఆల్యహాల్‌ లేదా డ్రగ్‌ అనే భావలో ఉన్నారు. ఈ విషయంలో నాకు నైతికతకు సంబంధించి ఎలాంటి సమస్య లేదు. కానీ సమస్య ఏంటంటే అది మీ అవర్‌నెస్‌ను దూరం చేస్తుంది. మీరు స్పృహలో ఉండరు అని చెప్పుకొచ్చారు. పూర్తిగా మత్తులో ఉంటూనే, సూపర్‌ అలర్ట్‌గా ఉండడం మన లక్ష్యమవ్వాలని సద్దుగురు తెలిపారు.

సద్గురుతో జరిగిన డైలాగ్‌ విత్‌ బరున్‌ దాస్‌ పూర్తి ఎపిసోడ్‌లు వీక్షించడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..