Farm Laws – Farmers Protest: లోక్‌సభలోనూ అదే రగడ.. వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు.. పలుమార్లు వాయిదా

|

Feb 03, 2021 | 5:38 PM

Rucks in Lok Sabha: కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగడం లేదు.. దీంతోపాటు తరచూ..

Farm Laws - Farmers Protest: లోక్‌సభలోనూ అదే రగడ.. వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు.. పలుమార్లు వాయిదా
Parliament session updates
Follow us on

Rucks in Lok Sabha: కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగడం లేదు.. దీంతోపాటు తరచూ వాయిదా పడుతున్నాయి. బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే దీనిపై చర్చ నిర్వహించాలని సభ్యులు ఆందోళన నిర్వహించడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈ అంశాలపై 15గంటలపాటు చర్చ జరిగేందుకు ప్రభుత్వం, విపక్ష సభ్యుల మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం సభ సజావుగా సాగింది. ఇదిలాఉంటే.. బడ్జెట్‌పై సాయంత్రం ప్రారంభమైన లోక్‌సభలో కూడా ఇదే పునరావృతమైంది. ప్రతిపక్షాల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది.

సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలపై చర్చించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా సముదాయించినప్పటికీ.. సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను 4.30 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నిరసన సాగించడంతో మళ్లీ వాయిదా వేశారు.

Also Read:

Rahul Gandhi: నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్..

ఢిల్లీ హింసాకాండపై పోలీసుల నజర్.. దీప్ సిధు ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు.. మరికొంత మందిపై కూడా..