ప్రధాని మోదీ కేబినెట్ భారీ నజరానా.. విమాన ఇంధన నిధికి రూ.10,000 కోట్లు ఆమోదం!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు బుధవారం (జూన్ 03) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రం ఒక వినూత్న అడుగు వేసింది.

ప్రధాని మోదీ కేబినెట్ భారీ నజరానా.. విమాన ఇంధన నిధికి రూ.10,000 కోట్లు ఆమోదం!
Minister Ashwini Vaishnav

Updated on: Jun 03, 2026 | 3:51 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు బుధవారం (జూన్ 03) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రం ఒక వినూత్న అడుగు వేసింది. ఇందులో భాగంగా “విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి” (Aviation Turbine Fuel Price Stabilization Fund) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధి కోసం ఏకంగా రూ. 10,000 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు నిరంతరం మారుతుండటంతో విమాన ఇంధన ధరలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇది విమానయాన సంస్థలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా, సామాన్య ప్రయాణికులపై టికెట్ ధరల రూపంలో ప్రభావం చూపుతోంది. తాజా నిధి కేటాయింపుతో ఇంధన ధరల్లో స్థిరత్వం ఏర్పడుతుందని, తద్వారా విమానయాన రంగం సంక్షోభంలో పడకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

కేవలం విమానయాన రంగమే కాకుండా, దేశ ప్రగతికి ఊతమిచ్చేలా ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలకు కూడా ఆమోదముద్ర పడినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us