తూత్తుకుడిలో ఎన్‌కౌంటర్‌.. రౌడీ షీటర్ మృతి

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని వళనాడు ప్రాంతంలో పోలీసులు, రౌడీ గ్యాంగ్ మధ్య కాల్పులు జరిగాయి.

తూత్తుకుడిలో ఎన్‌కౌంటర్‌.. రౌడీ షీటర్ మృతి

Updated on: Aug 18, 2020 | 4:43 PM

Thoothukudi Encounter news: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని వళనాడు ప్రాంతంలో పోలీసులు, రౌడీ గ్యాంగ్ మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులపై రౌడీ గ్యాంగ్‌ నాటు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులపై నాటు బాంబులతో దాడికి పాల్పడిన రౌడీ దురైముత్తుని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

కాగా దురైముత్తు తూత్తుకుడి పరిధిలో జరిగిన ఐదు హత్య కేసుల్లో నిందితుడు. తురముత్తు అనే వ్యక్తిని హత్య చేసేందుకు ఇతడు ఆయుధాలతో తిరుగుతున్నాడు. ఈ విషయంపై తురముత్తు  ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో దురైముత్తు ఇంటికి పోలీసులు వెళ్లగా.. వారిపై బాంబులతో దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ సుబ్రమణ్యమ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే పోలీసులు దురైముత్తుని ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.

Read More:

2400 ఏళ్ల నాటి ఈజిప్టు మమ్మీ.. 130 ఏళ్ల తరువాత పెట్టె నుంచి బయటకు

అమ్మా, నాన్న కావాలన్న 9 ఏళ్ల అనాథ.. ముందుకొచ్చిన 5వేల మంది

Loading...
Unable to load recommendations.
Follow Us