Ayodhya: అయోధ్యలో హోటల్‌ బుకింగ్స్‌ సరికొత్త రికార్డ్‌.. ఒక్క రూమ్‌ ఏకంగా రూ. లక్ష.

|

Jan 12, 2024 | 5:11 PM

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో అయోధ్య పట్టణం కొత్త కలను సంతరించుకుంటోంది. ఎన్నడూ లేని విధంగా అయోధ్యకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో రోజురోజుకీ...

Ayodhya: అయోధ్యలో హోటల్‌ బుకింగ్స్‌ సరికొత్త రికార్డ్‌.. ఒక్క రూమ్‌ ఏకంగా రూ. లక్ష.
Ayodhya
Follow us on

కోట్లాది మంది హిందువుల వందల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. జనవరి 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా శ్రీరామ నామ స్మరణ మారుమోగుతోంది. దేశం, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల దృష్టి అంతా అయోధ్యపైనే ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో అయోధ్య పట్టణం కొత్త కలను సంతరించుకుంటోంది. ఎన్నడూ లేని విధంగా అయోధ్యకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో రోజురోజుకీ అయోధ్యలో హోటల్‌ గదులకు అకస్మాత్తుగా డిమాండ్‌ పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగానే అద్దెలు కూడా అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో అయోధ్యలోని హోటల్‌ గదుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ప్రస్తుతం అయోధ్యలో హోటల్‌ గదులు బుకింగ్ 80 శాతం పెరిగింది. విలాసవంతమైన గదుల అద్దె ఏకంగా రూ. లక్ష పలకడం విశేషం. రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టత జరిగే జనవరి 22వ తేదీన అయోధ్యకు సుమారు 3నుంచి 5 లక్షల మంది అయోధ్యకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే చాలా హోటల్స్‌ నిండిపోయాయి. బిజినెట్ టుడే ప్రకారం అయోధ్యలోని సెగ్నెట్ కలెక్షన్‌ హోటల్‌లో ఒక గది అద్దె రూ.70,240 పలకడం విశేషం. ది రామయణ్‌ హోటల్‌లో ఒక గది రోజుకు రూ. 40,000 పలుకుతోంది.

ఇక అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన పార్క్‌ ఇన్‌ రాడిసన్‌ హోటల్‌లో విలాసవంతమైన గది ఒక్క రోజుకు ఏకంగా రూ. లక్ష పలకడం విశేషం. ఈ హోటల్‌లో ఒక్క రోజుకు అద్దె రూ. 7,500 నుంచి ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా అయోధ్యలోని పలు హోటల్స్‌లో 80 శాతం గదులు ఇప్పుడే బుక్‌ అయినట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ గది అద్దె సుమారు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా, రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..