సరిహద్దులు దాటిన ప్రేమకథ.. ప్రియురాలిని కలవడానికి వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!

ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారని చెప్పడానికి నిదర్శనంగా ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక అమ్మాయిని కలవడం కోసం నియంత్రణ రేఖ (LoC) దాటి భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పౌరుడిని భారత సైన్యం అరెస్ట్ చేసింది.

సరిహద్దులు దాటిన ప్రేమకథ.. ప్రియురాలిని కలవడానికి వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
Army Detains Lover From Pok

Updated on: May 31, 2026 | 6:38 PM

ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారని చెప్పడానికి నిదర్శనంగా ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక అమ్మాయిని కలవడం కోసం నియంత్రణ రేఖ (LoC) దాటి భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పౌరుడిని భారత సైన్యం అరెస్ట్ చేసింది. ఈ సైనిక చర్య ఆదివారం (మే 31, 2026) ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో జరిగింది. సియాల్‌కోట్ సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన సదరు PoK పౌరుడిని సైన్యానికి చెందిన 12 గ్రెనేడియర్స్ యూనిట్ అదుపులోకి తీసుకుంది.

నిఘా వర్గాల నివేదికల ప్రకారం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ జిల్లా, పైన్‌కాడి గ్రామానికి చెందిన లాల్ దిన్ మీర్ కుమారుడు జీషాన్ అహ్మద్ మీర్ (22) అనే యువకుడిగా అనుమానితుడిని గుర్తించారు. ఇతను బారాముల్లా జిల్లాలోని ఊరి పోలీస్ స్టేషన్ పరిధిలోని టిలై గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్ మీర్ కుమార్తె ఇరమ్ బానో అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. కేవలం ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతను ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటినట్లు విచారణలో తేలింది.

భారత సైన్యం సదరు యువకుడితో పాటు ఇరమ్ బానోను కూడా తమ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం భారత సైన్యంతో పాటు, వివిధ నిఘా సంస్థల అధికారులు కూడా వీరిద్దరిని తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ కథనం ప్రకారం, జీషన్‌కు సంబంధించిన పాకిస్తానీ జాతీయ గుర్తింపు కార్డు (ID Card No: 8260103931149, పుట్టిన తేదీ: 03/04/2004) సహా ఇతర కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లలో అతని పేరు ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో రాయబడి ఉంది. వీరిద్దరిని సైన్యం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఒక వీడియో కూడా ప్రస్తుతం బయటకు వచ్చింది. కేవలం ఇదొక ప్రేమ వ్యవహారమేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Army Detains Lover from PoK

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us