RG Kar Case: ఆర్జీకర్ కేసు.. హతురాలి మృతదేహంపై మరో మహిళ డీఎన్‌ఏ

| Edited By: Ram Naramaneni

Jan 21, 2025 | 4:27 PM

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో హత్యకు గురైన మహిళా డాక్టర్ మృతదేహం నుండి సేకరించిన నమూనాల విశ్లేషణలో దోషి సంజయ్ రాయ్‌తో పాటు మహిళా డిఎన్‌ఎ నమూనాలు కనిపించాయని ఒక నివేదిక తెలిపింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక కోర్టుకు సమర్పించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.

RG Kar Case: ఆర్జీకర్ కేసు.. హతురాలి మృతదేహంపై మరో మహిళ డీఎన్‌ఏ
R G Kar Rape Murder Case
Follow us on

ఆర్జీకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడికి జీవితఖైదు విధింపుపై అటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగగా.., ఇటు బెంగాల్‌ ప్రభుత్వం కూడా భగ్గుమంటోంది.  విచారణలో భాగంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి మృతదేహంపై మరో మహిళ DNA ఉన్నట్లు రిపోర్ట్‌ రావడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో దోషిగా తేలిన సంజయ్‌రాయ్‌ DNA మృతురాలి శరీరంపై 100 శాతం ఉండగా, మరికొంత స్ధాయిలో ఓ మహిళ DNA సైతం బయటపడింది. దీంతో అది పొరపాటున ఈ DNAతో కలిసిందా? లేక సదరు మహిళ కూడా ఈ నేరంలో భాగమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జూనియర్ వైద్యురాలి తండ్రి ఈ కేసులో మరికొందరు ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్‌ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి CBI సరిగ్గా ప్రయత్నించడం లేదన్నారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా DNA రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు చెప్పారన్నారు

-2024, ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటనలో ఆస్పత్రిలోని CCTVలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించింది.

 

మృతురాలి తండ్రి వెర్షన్‌
===========

  • -కేసులో మరికొందరు ప్రమేయం ఉంది
  • -మా కూతురు గొంతుపై గాయాలు ఉన్నాయి
  • -స్వాబ్ సేకరించలేదు. సీబీఐ కేసును త్వరగా విచారించట్లేదు
  • -డీఎన్ఏ రిపోర్టులో నలుగురు పురుషులు
  • -ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడైంది

హత్యాచారం తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు ఎంతలా వెల్లువెత్తాయో..తీర్పు తరువాత కూడా అంతే స్ధాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. తీర్పు నేపధ్యంలో పలు డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

ప్రజల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్స్…

  • -ఈ తీర్పుని స్వాగతించని జనం
  • -క్రూరుడికి ఇంత చిన్న శిక్ష ఏంటని మండిపాటు
  • -న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని ప్రశ్న
  • -నిందితుడికి మరణశిక్ష ఎందుకు వేయలేదన్న మమత
  • -రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి ఉంటే ఉరిపడేది-మమత
  • -ఉరివేయాలంటూ హైకోర్టుకు బెంగాల్‌ ప్రభుత్వం
  • -మరణశిక్ష పడేవరకు పోరాడతామన్న విద్యార్ధి సంఘాలు

మరి ఆందోళనలు, పై కోర్టులో సవాళ్ల నేపధ్యంలో ఏం జరుగుతోందోనన్న ఆసక్తి నెలకొంది.. మరోవైపు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆగదంటున్నారు విద్యార్ఠులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..