రజనీకాంత్ ధీమా వెనుక అసలు కారణమిదేనట!

| Edited By: Pardhasaradhi Peri

Feb 06, 2020 | 3:34 PM

సీఏఏపై తనదైన శైలిలో స్పందించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యూహంపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే.. ఆ కథనాలను పెద్దగా పట్టించుకోకుండా తనదైన పంథాను కొనసాగిస్తున్న రజనీకాంత్‌పై వివిధ పార్టీలకు చెందిన తమిళ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారి మాటలను పెద్దగా ఖాతరు చేయని రజనీకాంత్.. తన అభిప్రాయానికో లెక్కుందని చాటుతున్నారు. అయితే.. రజనీకాంత్ ధీమా వెనుక బలమైన కారణమే వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాట రజనీకాంత్ కామెంట్స్ సంచలనంగా మారాయి. సీఏఏను సమర్థించిన […]

రజనీకాంత్ ధీమా వెనుక అసలు కారణమిదేనట!
Follow us on

సీఏఏపై తనదైన శైలిలో స్పందించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యూహంపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే.. ఆ కథనాలను పెద్దగా పట్టించుకోకుండా తనదైన పంథాను కొనసాగిస్తున్న రజనీకాంత్‌పై వివిధ పార్టీలకు చెందిన తమిళ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారి మాటలను పెద్దగా ఖాతరు చేయని రజనీకాంత్.. తన అభిప్రాయానికో లెక్కుందని చాటుతున్నారు. అయితే.. రజనీకాంత్ ధీమా వెనుక బలమైన కారణమే వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తమిళనాట రజనీకాంత్ కామెంట్స్ సంచలనంగా మారాయి. సీఏఏను సమర్థించిన రజనీకాంత్.. కొత్త చట్టంతో ముస్లింలతో పాటు ఎవరికి నష్టం కలిగినా వారికి అండగా తాను పోరాడతానని ప్రకటించారు. ముందుగా సీఏఏని సమర్థించిన రజనీకాంత్.. ఆ తర్వాత తనపై వరుసగా పేలుతున్న కౌంటర్లపై కూడా నిబ్బరంగానే నిలబడ్డారు. పైగా తన వ్యాఖ్యలు ఆషామాషీగా చేసినవి కావన్నట్లుగా.. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం జరగదని, ఒకవేళ్ళ ముస్లింలతోపాటు ఎవరికి నష్టం కలిగినా తాను ఆందోళనకు దిగుతానని ప్రకటించారు.

దాంతో రజనీకాంత్ స్టబర్న్‌గా వుండడం వెనుక బీజేపీ నేతల అండ వుందంటూ తమిళ నేతలు చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం, డిఎంకే నేతలు స్టాలిన్, అళగిరి తదితరులు రజనీకాంత్‌పై మండిపడుతున్నారు. సీఏఏ గురించి రజనీకాంత్‌కు తెలియకపోతే తన వద్దకు రావాలని, తాను వివరిస్తానని ఉచిత సలహా ఒకటి పారేశారు అళగిరి. రజనీకాంత్ బీజేపీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడంటున్నారు చిదంబరం. రజనీకాంత్‌ వ్యాఖ్యలు సమాచార లోపంతో చేసినవిగా భావిస్తున్నానని, సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్‌‌కు తాను వివరిస్తానని చిదంబరం అంటున్నారు.

తమిళ నేతలు సీఏఏపై తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్న కామెంట్లకు రజనీకాంత్ కట్టుబడే వున్నారు. దాంతో రజనీకాంత్‌పై బీజేపీ ముద్ర వేసేందుకు తమిళ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజకీయ ప్రవేశంపై నటించాల్సిన అవసరం లేదంటున్న కార్తీ చిదంబరం.. రజనీకాంత్ బీజేపీలో చేరితే తమకు అభ్యంతరం లేదన్నారు. మొత్తమ్మీద రజనీకాంత్ ధీమా వెనుక బీజేపీ అధినేతల అండదండలే అసలు కారణమని తమిళ నేతలు తేల్చేస్తున్నారు.