మూగరోదన.. రతన్ టాటా కోసం తల్లడిల్లిన పెంపుడు కుక్క గోవా.. చివరకు పార్థివదేహం వద్ద.. వీడియో

|

Oct 11, 2024 | 8:42 AM

భారత మరో కోహినూర్‌, వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతావాది రతన్‌టాటా అంత్యక్రియలు వర్లి శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో జరిగాయి.. ముందుగా.. ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్‌టాటా పార్థివదేహాన్ని ప్రజాసందర్శన కోసం ముంబై NCPA గ్రౌండ్‌లో ఉంచారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది..

మూగరోదన.. రతన్ టాటా కోసం తల్లడిల్లిన పెంపుడు కుక్క గోవా.. చివరకు పార్థివదేహం వద్ద.. వీడియో
Ratan Tata Goa Dog
Follow us on

భారత మరో కోహినూర్‌, వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతావాది రతన్‌టాటా అంత్యక్రియలు వర్లి శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో జరిగాయి.. ముందుగా.. ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్‌టాటా పార్థివదేహాన్ని ప్రజాసందర్శన కోసం ముంబై NCPA గ్రౌండ్‌లో ఉంచారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.. ఆయన పెంపుడు శునకం రతన్ టాటా పార్థివదేహం దగ్గర నివాళులర్పించి ధీనంగా కూర్చున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి రతన్ టాటా జంతు ప్రేమికుడు.. ఆయనకు చిన్ననాటి నుంచే శునకాలంటే ఎంతో ఇష్టం.. రతన్ టాటా మరణించడంతో ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే గోవా శునకం ఆయన కోసం మూగవేదనతో ఎదురుచూస్తూ ఉండిపోయింది.. రతన్ టాటా కోసం తల్లడిల్లుతున్న గోవా శునకాన్ని చూసిన సిబ్బంది, పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లారు. రతన్ టాటా భౌతికకాయాన్ని చూస్తూ ఆ శునకం ధీనంగా అక్కడ కూర్చుంది. మృతదేహం నుంచి శునకాన్ని దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అది నిరాకరించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో చూడండి..

శునకాలంటే అమితమైన ప్రాణం..

రతన్ టాటాకు శునకాలంటే అమితమైన ప్రాణం.. గోవా (శునకం) తో రతన్‌ టాటాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఒకసారి రతన్‌టాటా గోవా వెళ్లారు. ఆ సమయంలో ఈ శునకం ఆయన వెంటే నడవడం ప్రారంభించింది. దీంతో ఆ మూగజీవిని చూసి ముచ్చట పడిన రతన్ టాటా.. దాన్ని దత్తత తీసుకుని గోవా అని పేరు పెట్టారు. అనంతరం ముంబయి తీసుకొచ్చి.. ఎంతో ప్రేమగా చూసుకుటున్నారు. అలా 11 ఏళ్లుగా ఆయనతో పాటు గోవా ఉంటున్నట్లు దాని కేర్‌టేకర్‌ మీడియాకు వివరించారు.

అవార్డు అందుకోవాల్సిన సమయంలో ఏం జరిగిందంటే..

టాటాకు మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో చెప్పే ఘటనలు చాలానే ఉన్నాయి.. పెంపుడు కుక్క అనారోగ్యంతో ఉందని కింగ్ చార్లెస్‌ను కలిసే కార్యక్రమాన్ని రతన్ టాటా వాయిదా వేసుకున్నారని.. సుహెల్ సేథ్ అనే వ్యాపారవేత్త తెలిపారు. వ్యాపారాన్ని చూసుకుంటూనే జంతువులపై ప్రేమను చాటుకున్నందుకు 2018లో రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించారు. రతన్ టాటా నుంచి తనకు 11 ఫోన్ కాల్స్ వచ్చాయని చివరకు తనను సంప్రదించగా తన పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో ఉందని అందుకే దానిని వదిలి అవార్డు తీసుకోలేనన్నారని సుహెల్ సేథ్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్‌ను అభినందించారన్నారు.

కార్యాలయంలోనే శునకాలు..

గతంలో ఓసారి వర్షం కురుస్తున్న సమయంలో ‘బాంబే హౌస్‌’ వెలుపల ఓ శునకం గజగజ వణుకుతుండడం చూసి చలించిపోయిన రతన్‌టాటా.. కార్యాలయంలోకి శునకాలను అనుమతించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. బాంబేహౌస్‌ను ఆధునికీకరించినప్పుడు గ్రౌండ్‌ఫ్లోర్‌లో శునకాల కోసం ఓ గదిని కూడా తీర్చిదిద్దారు. ఈ గదిలో ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన శునకాలకు అటెండర్‌ స్నానం చేయిస్తాడు. అనంతరం అవి బంకర్‌ బెడ్‌పై హాయిగా కొద్దిసేపు నిద్రిస్తాయి. కొన్ని శునకాలు శాశ్వతంగా బాంబేహౌస్‌లోనే ఉంటుండగా, మరికొన్ని అప్పుడప్పుడూ వస్తుంటాయని సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..