పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి తల్లి!

ఆంటీ.. నేను, మీ కూతురు ప్రేమించుకుంటున్నాం.. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం" అని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అడిగిన ఓ కుర్రాడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ విషయం చెప్పగానే కోపంతో ఊగిపోయిన యువతి తల్లి కిచెన్‌లో స్టౌపై మరుగుతున్న వేడివేడి నూనె తీసుకొచ్చి ఆ యువకుడిపై పోసేసింది. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి తల్లి!
Ai Representative Image

Updated on: Sep 06, 2026 | 9:23 AM

ప్రేమించిన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు వెళ్లిన ఓ యువకుడికి ప్రియురాలి తల్లి ఊహించని షాక్ ఇచ్చింది. తమ ప్రేమ విషయం చెప్పగానే కోపంతో ఊగిపోయిన ఆమె ఆ యువకుడిపై మరుగుతున్న నూనెను పోసేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఉత్తిరంపట్టు గ్రామానికి చెందిన దమీమ్‌ అనే మహిళకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే ఆమె భర్త మరణించడంతో పిల్లలతో కలిసి ఆమె ఒంటరిగా జీవిస్తోంది.

అయితే వీళ్లు ఇటీవలే తమ గ్రామాన్ని వదిలి కావేరిపాక్కానికి షిఫ్ట్‌ అయ్యారు. కాగా తమ సమీప గ్రామమైన ఆయర్‌పాడికి చెందిన లోకేష్‌ అనే యువకుడు, దమీమ్‌ కూతురు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రియురాలి తల్లికి చెప్పి.. తమ పెళ్లికి ఒప్పించాలని లోకేష్‌ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. “మీ కూతురు, నేను ప్రేమించుకున్నాం.. ఆమెను తనకిచ్చి పెళ్లిచేయండి” అని లోకేష్‌ దమీమ్‌ను కోరాడు.

ఈ విషయం విన్న వెంటనే తీవ్ర ఆగ్రహానికి లోనైన దమీమ్.. కిచెన్‌లోకి వెళ్లి స్టౌపై మరుగుతున్న నూనె తీసుకొచ్చి నేరుగా లోకేష్‌పై పోసేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన లోకేష్‌ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశాడు. లోకేష్‌ అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us