Ram temple in Ayodhya: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సన్నాహాలు జోరందుకుంటున్నాయి. ఈ గుడి నిర్మాణం, డిజైన్ ను తాము చేపడతామని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ ఎల్ & టీ ముందుకు వచ్చింది. సాంకేతికపరమైన సాయంతో బాటు నిర్మాణ ప్రాజెక్టుల బాధ్యతను తామే తీసుకుంటామని. పైగా ఏ మాత్రం సొమ్ము తీసుకోకుండా ఉచితంగానే ఈ సేవలు అందిస్తామని ఈ సంస్థ సంసిధ్ధత వ్యక్తం చేసినట్టు విశ్వహిందూ పరిషద్ వర్గాలు తెలిపాయి. ఇందుకు ఈ సంస్థ ఏ కాంట్రాక్టు పైనా సంతకం చేయబోదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన ట్రస్టీల బోర్డు, వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి ఈ కంపెనీ అధికారులతో టచ్ లో ఉంటారట. ఆలయ నిర్మాణ ప్రారంభ తేదీని నిర్ణయించేందుకు ట్రస్టీల బోర్డు అయోధ్యలో మార్చి మొదటివారంలో తమ రెండో సమావేశాన్ని నిర్వహింఛవచ్చు. ఎల్ అండ్ టీ సీనియర్ డిజైనర్ ఆర్.ఎం.వీరప్పన్ తన కంపెనీ తరఫున ఈ సమావేశానికి హాజరు కావచ్ఛునని తెలుస్తోంది. ఒక ఏజన్సీనుంచి ఆలయ నిర్మాణ పనులు, టెక్నికల్ హెల్ప్ తీసుకోవచ్చా అనే అంశంపై ఈ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరాదిన వైష్ణవులు పాటించే ‘నగర’ స్టయిల్ లో 270 అడుగుల పొడవునా భారీ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఒకప్పుడు కూల్చివేసిన ఆలయం మాదిరే ‘నగర’ స్టైల్ డిజైన్ ని ఎంపిక చేశారు.