Farmers protest – Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2 వరకు సమయమిచ్చామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతుందని.. ఆ తర్వాత ప్రణాళికను రచిస్తామని ఆయన స్పష్టంచేశారు. శనివారం నిర్వహించిన చక్కా జామ్ ఆందోళనలో భాగంగా తికాయత్ ఘాజీపూర్ బోర్డర్‌లో మాట్లాడారు. ఆందోళనలు విరమించాలంటూ తమపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వంతో చర్చలు జరపలేమంటూ ఆయన స్పష్టంచేశారు. అక్టోబరు 2 వరకు కేంద్రానికి గడువిచ్చామని.. ఆతర్వాత ప్రణాళిక రచిస్తామని ఆయన తెలిపారు. అయితే ఆందోళన హింసాత్మకంగా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని తికాయత్ ఆరోపించారు.
We have given time to the government till 2nd October to repeal the laws. After this, we will do further planning. We won’t hold discussions with the government under pressure: Rakesh Tikait, Bharatiya Kisan Union pic.twitter.com/HwqBYDIH5C
— ANI (@ANI) February 6, 2021
Also Read: