Rajya Sabha Election Results: మహారాష్ట్రలో బీజేపీ జోరు.. అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ

మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు రాజ్యసభ స్థానాల్లో మూడింటిని బీజేపీ గెలుచుకుంది.

Rajya Sabha Election Results: మహారాష్ట్రలో బీజేపీ జోరు.. అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ
BJP Leaders Celebrations
Follow us

|

Updated on: Jun 11, 2022 | 10:43 AM

మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ఆరు రాజ్యసభ స్థానాల్లో అంచనాలను మించి మూడింటిని బీజేపీ గెలుచుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి మూడు స్థానాలకు పరిమితమయ్యింది. ఈ రకమైన ఫలితాలు మహారాష్ట్రలో అధికార ఎంవీఏ కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందగా.. మహా వికాస్ అఘాడీ నుంచి ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), సంజయ్ రౌత్ (శివసేన), ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(కాంగ్రెస్) విజయం సాధించారు. శివసేన నుంచి పోటీ చేసిన మరో అభ్యర్థి సంజయ్ పవార్ ఓటమిపాలయ్యారు.

రాజ్యసభ ఎన్నికలను అధికార ఎంవీఏ కూటమి, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించాయి. నాలుగు స్థానాలు గెలిచేందుకు ఎంవీఏ కూటమి శర్వశక్తులూ ఒడ్డింది. అయితే ఎంవీఏ కూటమి ఆశలు, అంచనాలను తలకిందులు చేసింది బీజేపీ. కేవలం మూడు స్థానాలకు మాత్రమే ఎంవీఏ కూటమిని పరిమితం చేసి.. మిగిలిన మూడు స్థానాల్లో విజయం సాధించింది. అర్థరాత్రి వరకు హైడ్రామా కొనసాగగా.. చివరకు ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర నుంచి రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అభినందనలు తెలిపారు.అలాగే బీజేపీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.

మహారాష్ట్రలో బీజేపీ మూడు స్థానాలను కైవసం చేసుకోవడంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తంచేశారు. బీజేపీపై మహారాష్ట్ర మరోసారి విశ్వాసాన్ని ప్రకటించందని హర్షం వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..