Covid 4th Wave: భారత్‌లో ఫోర్త్ వేవ్ అలర్ట్.. 8 వేల మార్క్ దాటిన కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?

ప్రభావం అంతగా లేనప్పటికీ.. కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది.

Covid 4th Wave: భారత్‌లో ఫోర్త్ వేవ్ అలర్ట్.. 8 వేల మార్క్ దాటిన కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?
Coronavirus In India
Follow us

|

Updated on: Jun 11, 2022 | 9:28 AM

Coronavirus 4th wave in India: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. తాజాగా.. కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటింది. దాదాపు మూడు నెలల అనంతరం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రభావం అంతగా లేనప్పటికీ.. కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. శుక్రవారం 8,329 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 745 మేర పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి (Coronavirus) కారణంగా దేశవ్యాప్తంగా 10 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటడం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 40,370 కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 4,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.69 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి
  • దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య – 4,32,13,435
  • కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య – 4,26,48,308
  • దేశంలో మరణాల సంఖ్య 5,24,757 కి చేరింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 194.92 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న 15,08,406 మందికి టీకాలు ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్