మోదీ, అమిత్‌షాలకు రజనీకాంత్ షాక్.. ఏమన్నారంటే ?

|

Nov 08, 2019 | 1:04 PM

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ బిజెపి నేతలకు షాకిచ్చాడు. ఎంతో కాలంగా రజనీకాంత్‌ను బిజెపిలోకి రప్పించేందుకు కాషాయదళం చేస్తున్న ప్రయత్నాలు తనపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని తేల్చి చెప్పాడు. బిజెపితో డిస్టెన్స్ మేయింటేన్ చేస్తూనే రాజకీయాల్లో రాణిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు రజనీకాంత్. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై రెండు దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే వుంది. దేశంలోనే కాదు.. జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ లాంటి విదేశాలలో కూడా ఎంతో క్రేజ్ వున్న నటుడు రజనీకాంత్. […]

మోదీ, అమిత్‌షాలకు రజనీకాంత్ షాక్.. ఏమన్నారంటే ?
Follow us on
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ బిజెపి నేతలకు షాకిచ్చాడు. ఎంతో కాలంగా రజనీకాంత్‌ను బిజెపిలోకి రప్పించేందుకు కాషాయదళం చేస్తున్న ప్రయత్నాలు తనపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని తేల్చి చెప్పాడు. బిజెపితో డిస్టెన్స్ మేయింటేన్ చేస్తూనే రాజకీయాల్లో రాణిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు రజనీకాంత్.
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై రెండు దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే వుంది. దేశంలోనే కాదు.. జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ లాంటి విదేశాలలో కూడా ఎంతో క్రేజ్ వున్న నటుడు రజనీకాంత్. మిగితా హీరోలకు భిన్నంగా రజనీకాంత్ ఏం చేసినా హీరోయిజమే అన్న స్థాయిలో ఆయన సినిమాలకు స్పందన వుంటుంది. అదే సమయంలో తమిళులకు రజనీకాంత్ ఆరాధ్య దైవంతో సమానం. అందుకే ఆయన్ను ‘తలైవా’ అని ముద్దుగా పిలుచుకుంటారు.
తమిళ ఫ్యాన్స్. రజనీకాంత్ పుట్టుకరీత్యా మహారాష్ట్రీయన్ అయినా.. ఆ వాదన తమిళుల్లో ఆయనకున్న క్రేజీని ఏ మాత్రం తగ్గించలేకపోయాయి.
శివాజీరావ్ గైక్వాడ్ అన్న సొంత పేరు కంటే.. దర్శక దిగ్గజం కె.బాలచందర్ పట్టిన రజనీకాంత్ అనే పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన సూపర్ స్టార్.. ఇటీవలనే రాజకీయ అరంగేట్రం ఖాయమని ప్రకటించారు. సొంత పార్టీ పెడతానని కూడా చెప్పేశారు. అయితే దక్షిణాదితో తమకు కొరకరాని కొయ్యగా మారిన తమిళనాడులో పాగా వేయాలంటే రజనీకాంత్ లాంటి ప్రజాదరణ విశేషంగా వున్న వ్యక్తి అవసరమని భావించి.. పలు సందర్భాలలో ఆయన్ను బిజెపిలోకి లాగేందుకు ప్రయత్నించారు.. ఇంకా చేస్తూనే వున్నారు.
ఈనేపథ్యంలో రజనీకాంత్ బిజెపిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంమైంది. సహజంగా సుతిమెత్తగా మాట్లాడే రజనీకాంత్ శుక్రవారం బిజెపిపై కాస్త ఘాటుగానే మాట్లాడారు. తమిళనాట సుప్రసిద్ద కవి, రచయిత అయిన తిరువల్లూరుకు కాషాయ రంగు పూసినట్లుగానే తనకు కాషాయరంగు పూస్తామనుకుంటున్న బిజెపి నేతల ఆటలు సాగవంటూ రెచ్చిపోయారు రజనీకాంత్.
వేయి తిరుకురల్ రాసి, తెలుగు నాట యోగి వేమన లాగే పేరుగాంచిన తిరువల్లూరు విగ్రహానికి ఇటీవల బిజెపి నేతల కాషాయ రంగు వేశారు. అదే మాదిరిగా తనకు బిజెపి కాషాయ రంగు పూయాలనుకుంటోందని, కానీ బిజెపి నేతల ఆటలు తన ముందు సాగవని రజనీకాంత్ శుక్రవారం కామెంట్ చేశారు. బిజెపి నేతల ఎత్తుగడలకు తాను దొరకనంటూ తాను బిజెపితో దూరం పాటిస్తానన్న సంకేతాలను చాలా గట్టిగా ఇచ్చేశారు రజనీకాంత్.  సో.. బిజెపి నేతలు ఇకనైనా తమ ప్రయత్నాలను పక్కన పెట్టి.. తమిళనాడులో తామే సొంతగా ఎదగడానికి ప్రయత్నిస్తారో.. రజనీకాంత్ బలమెంతో చూశాకనే తమ వ్యూహమేంటో చూపిస్తారో వేచి చూడాలి.