సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్.. ఇతర పార్టీల్లో చేరుతున్న అభిమానులు..అధిష్టానం స్పందన ఏంటంటే..?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్.. ఇతర పార్టీల్లో చేరుతున్న అభిమానులు..అధిష్టానం స్పందన ఏంటంటే..?

తలైవా ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు తొలుత రిక్వెస్ట్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆ తర్వాత ఆందోళనలు కూడా నిర్వహించారు.

Ram Naramaneni

|

Jan 18, 2021 | 2:42 PM

Rajinikanth’s ‘Makkal Mandram’ : తలైవా ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు తొలుత రిక్వెస్ట్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆ తర్వాత ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినా కానీ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయడం వీలుకాదని మరోసారి స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు రజనీ. దీంతో తలైవా అభిమానులు హర్టయ్యారు. ఇలా అయితే తాము వెనక ఉండమని తలో దారి చూసుకుంటున్నారు. అవును తలైవాకు అభిమానులు షాక్ ఇస్తున్నారు.  మక్కల్ మండ్రమ్ నుంచి ఇతర పార్టీల్లో చేరుతున్నారు నేతలు.

రజనీకాంత్ యాక్టీవ్ పాలిటిక్స్‌ వైపు అడుగులు వేయకపోవడంతో మక్కల్ మండ్రమ్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తికి లోనవుతున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు ఇప్పటికే  డీఎంకేలో చేరారు. మరికొందరు  ఏఐఏడిఎంకేలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రజనీ మక్కల్ మండ్రమ్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ పార్టీ నాయకులుకు, శ్రేణులకు లేఖ రాశారు. ఇతర పార్టీలకు వెళ్లాలనుకునేవారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు.

Also Read:

Ramatheertham: రామతీర్థం విగ్రహాల పునఃప్రతిష్టాపనలో కీలక ఘట్టం.. ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించిన అధికారులు..

Suicide in Adilabad: ఆర్మీ ఉద్యోగానికి పనికిరానని యువకుడి ఆత్మహత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu