యూపీలో మారనున్న మరో నగరం పేరు..! సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరును కూడా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో మూడోసారి అధికారంలో వస్తే అక్బర్‌పూర్ పేరును మార్చేస్తామని ఆయన తెలిపారు. ఆ నగరం పేరును ఉచ్చరిస్తే చెడు రుచి వస్తుందన్నారు.

యూపీలో మారనున్న మరో నగరం పేరు..! సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన
UP CM Yogi Adityanath
Follow us

|

Updated on: May 10, 2024 | 7:01 PM

ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరును కూడా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో మూడోసారి అధికారంలో వస్తే అక్బర్‌పూర్ నగరం పేరును మార్చేస్తామని ఆయన తెలిపారు. ఆ నగరం పేరును ఉచ్చరిస్తే చెడు రుచి వస్తోందని.. ఇవన్నీ మారిపోతాయని హామీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత బానిసత్వ గుర్తులను చెరిపేసి, భారత సంస్కృతికి పెద్దపీట వేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు దీనిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే.. అక్బర్‌పూర్ పేరు మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరిట ఉన్న అక్బర్‌పూర్‌ నగరం పేరును మారుస్తామని యోగీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అక్బర్‌పూర్‌తో పాటు అలీఘడ్, అజంఘడ్, షాజహాన్‌పూర్, ఘజియాబాద్,ఫిరోజాబాద్, ఫరూఖాబాద్, మొరదాబాద్ పేర్లను మార్చాలన్న డిమాండ్లను యోగి ఆదిత్యనాథ్ పరిశీలనలో ఉన్నాయి. 2017లో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. యూపీలోని పలు రోడ్లు, పార్కులు, భవంతులు, కూడళ్ల పేర్లను మార్చారు. వీటిలో చాలా వాటికి మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టారు. ఒక్క లక్నోలోనే అటల్ బిహారి వాజ్‌‌పేయి రోడ్, అటల్ చౌరాహ, అటల్ బిహారి వాజ్‌పేయి కాన్ఫెరెన్స్ సెంటర్, అటల్ సేతు, అటల్ బిహారి కల్యాణ మండపం పేరు పెట్టారు.

ఇటీవల ఆ రాష్ట్రంలోని ముఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్‌ పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా పేరు మార్చడం తెలిసిందే. 2019లో కుంభమేళాకు ముందు అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చారు. అలీఘడ్, హరిఘడ్ పేరు మార్పునకు ఆయా మున్సిపాలిటీలు నిర్ణయం తీసుకున్నాయి. మెయిన్‌పురి పేరును మాయాపురి, ఫిరోజాబాద్ పేరును చంద్రా నగర్‌గా మార్చాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ