రాజస్తాన్, ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీస్

రాజస్తాన్ లో    బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఆరుగురు  మాజీ  ఎమ్మెల్యేలకు హైకోర్టు,నోటీసులు జారీ చేసింది. అలాగే స్పీకర్ సీపీ జోషీకి కూడా నోటీసు జారీ అయింది. ఈ ఎమ్మెల్యేల విషయంలో నిబంధనల ఉల్లంఘన..

రాజస్తాన్, ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీస్

Edited By:

Updated on: Jul 30, 2020 | 5:58 PM

రాజస్తాన్ లో    బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఆరుగురు  మాజీ  ఎమ్మెల్యేలకు హైకోర్టు,నోటీసులు జారీ చేసింది. అలాగే స్పీకర్ సీపీ జోషీకి కూడా నోటీసు జారీ అయింది. ఈ ఎమ్మెల్యేల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ, బీఎస్పీనేతలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై వీరికి నోటీసులు జారీ చేసిన రాజస్తాన్ హైకోర్టు..ఆగస్టు 11 లోగా తమ సమాధానాలు పంపాలని ఆదేశించింది. వీరు గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే. ఈ అంశంలో కోర్టు ప్రకటించే నిర్ణయం సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ మనుగడకు కీలకం కావచ్ఛు.. సచిన్ పైలట్ వర్గం నుంచి ‘ముప్పు’ ను ఎదుర్కొంటున్నఈయన… శాసన సభలో బలం నిరూపించుకోవాలంటే వీరి మద్దతు చాలావరకు అవసరమవుతుంది. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కుతామని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఇదివరకే హెచ్ఛరించారు.

అటు-ఆగస్టు 14 నుంచి అసెంబ్లీని సమావేశపరచేందుకు గవర్నర్ అంగీకరించారు. దీంతో సీఎం గెహ్లాట్ అప్పుడే తన కేబినెట్ తోను, తన వర్గం ఎమ్మెల్యేలతోను సంప్రదింపులు ప్రారంభించారు.