కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఈ యాత్ర రాజస్థాన్‌లోని అల్వార్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అల్వార్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన అశోక్ గహ్లోత్ ఈ ప్రకటన చేశారు. అయితే ఈ సందర్బంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఉజ్వల్ పథకం లబ్ధిదారులు వినియోగిస్తోన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు సగానికి పైగా తగ్గించనున్నట్టు ప్రకటించారు. అయితే, ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేవలం రూ.500లకే గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయించుకొనే వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇది కేవలం బీపీఎల్‌కు చెందినవారితోపాటు ఉజ్వల్ పథకంలో నమోదు చేసుకొన్న కుటుంబాలే దీనికి అర్హులని స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధరకే అందజేస్తామన్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో అవస్థలు పడుతున్న జనానికి ఉపశమనం కలిగించేలా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ గహ్లోత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఈ ద్రవ్యోల్బణం సమయంలో మేము మీ కోసం చేయగలిగినదంతా చేస్తాం. ఇవాళ పిండి, పప్పు, బియ్యం, నూనెతో సహా అన్నీ ఖరీదైనవిగా మారాయి. పేదల అవసరాలను తీర్చే ఇలాంటి పథకాన్ని రానున్న నెలల్లో తీసుకురావాలనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి అడుగులు వేస్తూ ద్రవ్యోల్బణ పీడను అంతం చేస్తాం.
మోదీ ప్రభుత్వంపైనా సీఎం అశోక్ గహ్లోట్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని.. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు సైతం భయంతో పనిచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నియంతృత్వ ధోరణిలో పాలిస్తూ ఈ దేశాన్నిఎటువైపు తీసుకెళ్తారో ఎవరికీ అర్థంకావడంలేదని విమర్శించారు. కేంద్రాన్ని విమర్శిస్తున్నవారిని జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం