రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ నెల 27 వరకు పొడిగింపు.. పోలీసుల అభ్యర్థనకు ఓకే చెప్పిన కోర్టు

| Edited By: Phani CH

Jul 23, 2021 | 4:48 PM

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. అతని కస్టడీ శుక్రవారంతో ముగిసినప్పటికీ .. మరి కొంత ఇంటరాగేషన్ చేయవలసి ఉన్నందున ఈ కస్టడీని పొడిగించాలని ముంబై పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టును కోరారు.

రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ నెల 27 వరకు పొడిగింపు.. పోలీసుల అభ్యర్థనకు ఓకే చెప్పిన కోర్టు
Raj Kundra
Follow us on

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. అతని కస్టడీ శుక్రవారంతో ముగిసినప్పటికీ .. మరి కొంత ఇంటరాగేషన్ చేయవలసి ఉన్నందున ఈ కస్టడీని పొడిగించాలని ముంబై పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టును కోరారు. ఇందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోర్న్ చిత్రాల ద్వారా సంపాదించిన సొమ్మును ఇతగాడు ఆన్ లైన్ బెట్టింగ్ కోసం వినియోగించేవాడని పోలీసులు తెలిపారు.. అందువల్ల ఇతనికి సంబంధించి ఎస్ బ్యాంకు అకౌంట్ లోను, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా లోను గల ఇతని ఖాతాలను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రా సహచరుడు ర్యాన్ తోర్పె కస్టడీని కూడా కోర్టు 27 వరకు పొడిగించింది. వీరిద్దరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కుంద్రాపై ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.

సాగరికా సుమోనా సుమన్ అనే యువతి తనకు వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇందుకు వీడియో కాల్ లో నగ్నంగా ఆడిషన్ ఇవ్వాలని కుంద్రా కోరేవాడని, అందుకు తాను తిరస్కరించానని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇతని పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి నిన్ను రేప్ చేస్తామని,హతమారుస్తామనితనకు బెదిరింపులు వచ్చేవని ఆమె వెల్లడించింది. కుంద్రా నెట్ వర్క్ పెద్దదేనని, బ్రిటన్ లో ఇతగాడు ఓ కంపెనీ పెట్టి ఇండియాలో తీసిన పోర్న్ చిత్రాలను అక్కడి తన సహచరుడికి పంపేవాడని పోలీసులు తెలిపారు.ఇలా ఉండగా విచారణలో కుంద్రా పోలీసులకు సహకరించడం లేదని తెలిసింది. వారు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చాడని తెలియవచ్చింది. ఈ కారణం వల్లే ఇతని కస్టడీని పొడిగించాలని వారు కోర్టును కోరారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Raj Kundra: రాజ్ కుంద్రా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..కస్టడీ పొడిగింపు..కొంత డేటా తొలగించాడని గుర్తించిన పోలీసులు

Ys Viveka murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. వాచ్‌మన్ రంగయ్య సంచలన వాంగ్మూలం