ముంబై అతలాకుతలం..జనజీవనం అస్తవ్యస్తం

| Edited By:

Jul 02, 2019 | 5:22 PM

భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్క తూర్పు మలద్ ప్రాంతంలోనే మంగళవారం ఉదయం గోడ కూలిపోయి 18 మంది మరణించగా.. శిథిలాల్లో పదేళ్ల బాలిక చిక్కుకుంది. ఇదే ప్రాంతంలో ఇళ్ళు కూలి 34 మంది, కురార్ గ్రామంలో 51 మంది గాయపడ్డారు. రాబోయే 24 గంటల్లో మరిన్ని వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ హెచ్ఛరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది. రైల్వే ట్రాక్ లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో… […]

ముంబై అతలాకుతలం..జనజీవనం అస్తవ్యస్తం
Follow us on

భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్క తూర్పు మలద్ ప్రాంతంలోనే మంగళవారం ఉదయం గోడ కూలిపోయి 18 మంది మరణించగా.. శిథిలాల్లో పదేళ్ల బాలిక చిక్కుకుంది. ఇదే ప్రాంతంలో ఇళ్ళు కూలి 34 మంది, కురార్ గ్రామంలో 51 మంది గాయపడ్డారు. రాబోయే 24 గంటల్లో మరిన్ని వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ హెచ్ఛరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది. రైల్వే ట్రాక్ లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో… పలు రైలు సర్వీసులను రద్దు చేయడమో, రైళ్లను దారి మళ్లించడం చేశారు. భారీ వర్షం కారణంగా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న రాత్రి పదకొండున్నర ప్రాంతంలో స్పైస్ జెట్ విమానమొకటి రన్ వే చివరలో చిక్కుబడిపోవడంతో.. రన్ వే ను మూసివేశారు. హైదరాబాద్-ముంబై విమాన సర్వీసులను రద్దు చేశారు. మొత్తం 52 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయగా, 55 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఈ రెండు రోజుల్లోనే 540 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వెయ్యిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వాహనదారుల ఇక్కట్లు ఇన్నీఅన్నీ కావు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గత పదేళ్ల అనంతరం ముంబైని ఇలా వర్షం ముంచెత్తడం ఇదే మొదటిసారని అంటున్నారు.