
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుంచి అక్టోబర్ 30వ తేదీ ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకోనుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. అక్కడి షాద్ నగర్ బైపాస్ లోని సోలిపూర్ చేరుకుంటుంది. రాత్రికి షాద్ నగర్ ఆర్టీవో కార్యాలయం సమీపంలోని ఫరూక్ నగర్ లో రాత్రి బస చేస్తారు రాహుల్ గాంధీ. ఈరోజు భారత్ జోడో పాదయాత్ర 22 కి.లోమీటర్ల మేర సాగనుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 53 రోజులుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ రాహుల్ గాంధీ ముందుకుసాగుతున్నారు. తన పాదయాత్ర మార్గంతో పాటు.. పాదయాత్ర ముగిసన తర్వాత కూడా ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని.. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్ ) ప్రజల సొమ్మును దోచుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ. బాలానగర్ మండలంలోని పెద్దాయిపల్లిలో భోజన విరామం కోసం ఆగనున్నారు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యం,అణగారిన వర్గాల స్థితి గతులపై రామ మేల్కొటే, సుమన మార్టిన్ వంటి ప్రొఫెసర్ ల తో భేటీ కానున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తన పదయాత్రలో భాగంగా మేధావులు, విశ్లేషకులతో ముచ్చటించనున్నారు.
LIVE: With an overwhelming support from the people of Telangana, #BharatJodoYatra resumes from Gollapalli. https://t.co/o0AmQ6PcIa
— Congress (@INCIndia) October 30, 2022
భారత్ జోడో యాత్రలో భాగంగా శనివారం గొల్లపల్లిలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని, రాజకీయ స్వార్థ ప్రయోజనాలనే చూసుకుంటున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని టీఆర్ ఎస్ పై మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు రెండూ ఒక తాను ముక్కలేనని ఆరోపించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని, కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలన్ని ప్రైవేట్ వారి చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఏం కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..