తమిళనాడులో జల్లికట్టును చూసేందుకు రాహుల్ గాంధీ నిర్ణయం. రేపు మదురైకి ప్రయాణం. తమిళ కాంగ్రెస్ చీఫ్ అళగిరి

| Edited By: Pardhasaradhi Peri

Jan 12, 2021 | 5:50 PM

వివాదాస్పదమైన జల్లికట్టును చూసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తమిళనాడుకు వెళ్తున్నారు. మదురైలో ఆయన జల్లికట్టు పోటీలను..

తమిళనాడులో జల్లికట్టును చూసేందుకు రాహుల్ గాంధీ నిర్ణయం. రేపు మదురైకి ప్రయాణం. తమిళ కాంగ్రెస్ చీఫ్ అళగిరి
Follow us on

వివాదాస్పదమైన జల్లికట్టును చూసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తమిళనాడుకు వెళ్తున్నారు. మదురైలో ఆయన జల్లికట్టు పోటీలను చూస్తారని రాష్ట్ర కాంగ్రెస్  నేత  కె.ఎస్. అళగిరి తెలిపారు. ఇలా వీటిని చూడడం ద్వారా తాను రైతు పక్షపాతినని చాటుకుంటారన్నారు. ఎద్దులు రైతుల జీవితాల్లో భాగమని, రాహుల్ పర్యటన ఈ పంటల సీజన్ లో అన్నదాతల ఉత్సాహానికే కాక , తమిళ సంస్కృతికి కూడా దోహదపడుతుందని అళగిరి పేర్కొన్నారు. రాహుల్ ఈ నగరంలో నాలుగు గంటలపాటు గడపనున్నారు. రానున్న ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 38 సీట్లకు గాను 37 స్థానాలను గెలుచుకుంది. ఇపుడు మళ్ళీ శాసన సభ ఎన్నికల్లో ఆ హవా రిపీట్ అవుతుందని ఆశిస్తోంది.

ఇటీవలే తమిళనాట అళగిరి పార్టీ మారవచ్ఛుననో, కొత్త పార్టీ పెడతారనో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదానికి ఆయన ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వివాదాలు ఎందుకని ఆయన తన ప్రతిపాదనలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

 

Also Read:

Serum Institute covishield Vaccine: తక్కువ ధరకే కోవిడ్‌ వ్యాక్సిన్‌.. సీరం ఇనిస్టిట్యూట్‌ కీలక నిర్ణయం

బాలికల వివాహంపై వయో పరిమితి ఎందుకు ? దీన్ని పెంచాల్సిందే ! మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

Big Shock to TDP : టీడీపీకి 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా