Bharat Jodo Nyay Yatra: భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభం.. ఖర్గే, రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

|

Jan 14, 2024 | 6:26 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమయ్యింది. మణిపూర్‌ లోని ఖోంగ్జోమ్‌ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమయ్యింది. రాహుల్‌ ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం పొగమంచు కారణంగా కాస్తా ఆలస్యమైంది. దీంతో ఆలస్యంతో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక విమానంలో రాహుల్‌గాంధీ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ చేరుకున్నారు.

Bharat Jodo Nyay Yatra: భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభం.. ఖర్గే, రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
Bharat Jodo Nyay Yatra
Follow us on

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమయ్యింది. మణిపూర్‌ లోని ఖోంగ్జోమ్‌ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమయ్యింది. రాహుల్‌ ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం పొగమంచు కారణంగా కాస్తా ఆలస్యమైంది. దీంతో ఆలస్యంతో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక విమానంలో రాహుల్‌గాంధీ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ చేరుకున్నారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్‌కు ఘనస్వాగతం లభించింది. రాహుల్‌తోపాటు ఏఐసీసీ నేతలు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మణిపూర్‌ ప్రజల్లో ధైర్యం నింపడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. మణిపూర్‌ పూర్తిగా ధ్వంసమయ్యిందన్న రాహుల్‌గాంధీ..ఇప్పటివరకు మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదంటూ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మణిపూర్‌ను భారత్‌లో అంతర్భాగంగా భావించడం లేదన్నారు. దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్‌ జోడో న్యాయ్ యాత్రను చేపట్టినట్లు రాహుల్‌ వివరించారు. భారత్‌ న్యాయ్‌ యాత్ర ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని , అన్యాయ్‌ కాలంలో ఉన్నామని ,అందుకే న్యాయ్‌ యాత్రను చేపట్టినట్టు తెలిపారు రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. ఇది ఎన్నికల యాత్ర కాదు..ఇది సైద్ధాంతిక యాత్ర అంటూ పేర్కొన్నారు. ఓట్ల కోసమే మోదీ మణిపూర్‌లో పర్యటిస్తారన్నారు. దేశ యువత చాలా కష్టాల్లో ఉందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ తోనే సాధ్యమన్నారు. ఓట్ల కోసమే మోదీ రాముడి జపం చేస్తున్నారని విమర్శించారు.

కాగా.. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పళ్లంరాజు, షర్మిల మణిపూర్‌లో రాహుల్ భారత్‌ జోడో న్యాయ్‌యాత్రలో పాల్గొన్నారు. మణిపూర్‌ లోని తౌబల్‌ జిల్లా ఖోంగ్జోమ్‌ గ్రామం నుంచి న్యాయ్‌ యాత్ర ప్రారంభమవుతోంది. వార్‌ మెమోరియల్‌ దగ్గర ఘననివాళి అర్పించారు రాహుల్‌గాంధీ.. మణిపూర్‌ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ను సన్మానించారు.

భారత్‌ జోడో యాత్రకు భిన్నంగా భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర సాగుతోంది. పాదయాత్రతో పాటు బస్సుయాత్రలో పాల్గొంటున్నారు రాహుల్‌. 6713 కిలోమీటర్ల మేర రాహుల్‌ యాత్ర కొనసాగుతుంది. మణిపూర్‌ టు ముంబై వరకు రాహుల్‌ న్యాయ్‌ యాత్ర కొనసాగనుంది.. 5 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా యాత్ర జరగనుంది. 67 రోజుల్లో 110 జిల్లాలను కవర్ చేస్తూ రాహుల్‌ యాత్ర చేపట్టనున్నారు. మార్చి 21వ తేదీన ముంబైలో న్యాయ్‌ యాత్ర ముగియనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..