‘రైతుల తరువాత..ఇప్పుడు కార్మికుల వంతు’. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్

| Edited By: Anil kumar poka

Sep 24, 2020 | 12:34 PM

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల తరువాత ఇప్పుడు కార్మికులపై పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ (రాజ్యసభ) కేవలం రెండు రోజుల్లో 15 బిల్లులను ఆమోదించింది.

రైతుల తరువాత..ఇప్పుడు కార్మికుల వంతు. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
Follow us on

 

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల తరువాత ఇప్పుడు కార్మికులపై పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ (రాజ్యసభ) కేవలం రెండు రోజుల్లో 15 బిల్లులను ఆమోదించింది. వీటిలో మూడు బిల్లులు వివాదాస్పదమైన, కార్మిక వ్యతిరేక బిల్లులు కూడా ఉన్నాయన్నది విపక్షాల ఆరోపణ. ఈ నేపథ్యంలో రాహుల్ మోదీ సర్కార్ పై ధ్వజమెత్తారు.  రైతు బిల్లులను పార్లమెంట్ చేత ఎలాగో ఒకలా ఆమోదింప జేసి తాజాగా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం పాటిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఒక కంపెనీలో ఉన్న కార్మికుల్లో 300 మందిని తొలగించేందుకు (లే ఆఫ్) ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆ కంపెనీ యాజమాన్యానికి వీలు కల్పించే వెసులుబాటును  ఈ బిల్లుల్లో ఓ దానిలో నిర్దేశించారు. ప్రస్తుతం ఇది 100 మంది కార్మికులకే వర్తించేలా నిబంధన ఉంది.

ప్రతిపక్షాలు లేకుండానే ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించిన విషయం గమనార్హం.