ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తి,, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

| Edited By: Anil kumar poka

Feb 13, 2021 | 2:57 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. నిన్న ఆయనపై విరుచుకుపడిన ఆమె...

ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తి,, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్
Follow us on

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. నిన్న ఆయనపై విరుచుకుపడిన ఆమె శనివారం కూడా అదే తీరున ఆయనపై  మండిపడ్డారు. ఇండియాకు రాహుల్ డూమ్స్  డే మ్యాన్ గా మారుతున్నారని అన్నారు. రైతుల సమస్య, ఇండో-చైనా ఉద్రిక్థతలు తదితర అంశాలపై అదే పనిగా కొన్ని నెలలు, వారాలుగా రాహుల్.. మోదీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆమె అన్నారు. క్రోనీస్ అంటే ఎవరు ? మా క్రోనీలు ఈ దేశ సామాన్య ప్రజలే అన్నారు. బడ్జెట్ సంబంధిత ప్రశ్నలపై లోక్ సభలో సమాధానం ఇవ్వడానికి ముందు నిర్మలా సీతారామన్.. ఇలా రాహుల్ పై విమర్సనాస్త్రాలు సంధించారు. క్రోనీలు ఎక్కడ ? బహుశా వారు ప్రజలు తిరస్కరించిన (కాంగ్రెస్) పార్టీ నీడలో తలదాచుకున్నట్టు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. కనీసం ఒక  రేవును డెవలప్ చేయడానికి ఆహ్వానం అందినప్పటికీ దాన్ని ఈ పార్టీ డెవలప్ చేయలేకపోయిందని, ఓపెన్ టెండర్లు గానీ, గ్లోబల్ టెండర్లు గానీ లేవని ఆమె చెప్పారు.

రైతుల పట్ల మీరు, మీ పార్టీ యూ-టర్న్ తీసుకున్నారు..రైతు రుణాలను మాఫీ చేస్తామని రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మీ మేనిఫెస్టోల్లో హామీ ఇఛ్చి కూడా విఫలమయ్యారు అని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ‘హమ్ దో..హమారే దో’,,అంటూ రాహుల్ చేసిన విమర్శను ఆమె ప్రస్తావిస్తూ.. తమ భూములు ప్రభుత్వానికి అప్పగిస్తామని హామీ ఇచ్చి కూడా అలా చేయని ‘దా మా ద్’ ల (సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా) గురించి మీరు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. రాబర్ట్ వాద్రా భూముల వివాదాల్లో ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్న సంగతి విదితమే.

మరిన్ని చదవండి ఇక్కడ: India-China Border: భారత్, చైనా మధ్యలో రాహుల్.. ఎడతెగని వాదోపవాదాలు.. పాంగాంగ్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?

మరిన్ని చదవండి ఇక్కడ: సీఏ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన పేదింటి అమ్మాయి.. రాత్రిపూట చదువుకొని లక్ష్యాన్ని సాధించిన జరీన్‌ఖాన్..