
ఎమ్మెల్యేలకు కూడా గృహహింస తప్పడం లేదు. పంజాబ్ ఆప్ మహిళా ఎమ్మెల్యే బల్జీందర్‌కౌర్‌ను ఆమె భర్త సుఖ్‌రాజ్‌సింగ్ పబ్లిక్‌గా కొట్టడం తీవ్ర సంచలనం రేపింది. తల్వాండ్ సాబ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బల్జీందర్‌కౌర్.. తన ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో బల్జీందర్‌కౌర్‌కు భర్తతో వాగ్వాదం జరిగింది. సుఖ్‌రాజ్‌సింగ్ కోపంతో లేచి బల్జీందర్‌ను కొట్టాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సుఖ్‌రాజ్‌సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. సుఖ్‌రాజ్‌సింగ్ గతంలో ఆప్ యూత్‌వింగ్ లీడర్‌గా పనిచేశారు. బల్జీందర్ కౌర్ గతంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
అసులు ఏం జరిగిందంటే..
పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ ఎన్నికయ్యారు. గత కొద్ది రోజులుగా కౌర్ భర్త సుఖ్‌రాజ్ సింగ్ మధ్య ఏదో కారణంతో మాట మాట పెరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సుఖ్‌రాజ్ అందరి ముందే కౌర్‌పై చేయిచేసుకున్నారు. దీంతో పక్కనున్నవారు వెంటనే అడ్డుకుని సుఖ్‌రాజ్‌ను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ రీ ట్విటర్ చేశారు. ఓ ఎమ్మెల్యేపై భర్త దాడి చేయడాన్ని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పురుషుల ఆలోచనాధోరణి మారాలంటూ ట్వీట్ చేశారు.
The lady being assaulted is AAP MLA Baljinder Kaur and man doing so is her husband…. #Punjab pic.twitter.com/uMLVoeP3UP
— Arshdeep (@arsh_kaur7) September 1, 2022
ఈ దాడి ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యల గురించి మాట్లాడే మహిళల ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం పేర్కొన్నారు. అయితే దీనిపై ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. పోలీసులకు కూడా ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదు తీసుకోలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం