
లంచం ఆరోపణలపై అరెస్టయిన పంజాబ్ డిఐజి హర్చరణ్ సింగ్ భుల్లార్ నుండి సిబిఐ ఏకంగా రూ.7.5 కోట్లు స్వాధీనం చేసుకుంది. దాదాపు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రోలెక్స్, రాడో వంటి బ్రాండ్లకు చెందిన 26 లగ్జరీ వాచ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ డీలర్ నుండి రూ.8 లక్షల లంచం తీసుకొని, నెలవారీ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయాలని డిమాండ్ చేసినందుకు గురువారం భుల్లార్‌ను కేంద్ర ఏజెన్సీ అరెస్టు చేసింది.
అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులో డిఐజి అరెస్టు అయిన 48 గంటల తర్వాత స్వయంచాలకంగా సస్పెండ్ అయినట్లు పరిగణిస్తున్నట్లు పేర్కొంది. సిబిఐ నిందితుడైన పోలీసు అధికారిని చండీగఢ్‌లోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది, ఆ తర్వాత శుక్రవారం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సోదాల సమయంలో కుటుంబ సభ్యులు, అనుమానిత బినామీ కంపెనీల పేరిట ఉన్న 50కి పైగా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, లాకర్ కీలు, అనేక బ్యాంకు ఖాతాల వివరాలు, నాలుగు తుపాకీలతో పాటు 100 గుళికలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు.
ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని మండి గోవింద్ గఢ్ కు చెందిన స్క్రాప్ డీలర్ ఫిర్యాదు మేరకు భుల్లర్ ను మొహాలీలోని ఆయన కార్యాలయం నుండి అరెస్టు చేశారు. 2023లో దాఖలైన ఎఫ్ఐఆర్ ను పరిష్కరించడానికి నెలవారీ చెల్లింపులు డిమాండ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. చండీగఢ్ లోని సెక్టార్ 40లోని డిఐజి భుల్లర్ నివాసంలో రాత్రంతా సోదాలు జరిగాయి.
Punjab | DIG Ropar Harcharan Singh Bhullar suspended with effect from 16.10.2025, as 48 hours have lapsed since his arrest.
He was arrested on 16th October for allegedly accepting a bribe. pic.twitter.com/cKExTJTmob
— ANI (@ANI) October 18, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి