జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో పుల్వామా రిపీట్ అవుతుందంటూ పాకిస్తాన్ ప్రధాని సైతం హెచ్చరికలు చేశాడు. ఈ క్రమంలో ఐబీ కూడా కేంద్రాన్ని హెచ్చరించింది. పీవోకేలో భారత సైన్యంపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేశారని ఐబీ తెలిపింది. భారీగా విధ్వంసానికి లష్కరే, జైషే ఉగ్రవాదులు కుట్ర పన్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైన్యాన్ని అప్రమత్తం చేసింది కేంద్రం.
ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్‌లో పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రాజౌరి సెక్టార్ సుందర్‌బనీలో పాక్ రేంజర్లు మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పులను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు.